Sidhu Moose Wala : సిద్దూ హత్య వెనుక కెనడా గ్యాంగ్‌స్టర్
30 సార్లు కాల్పుల మోత ఆపై టెస్టింగ్
Sidhu Moose Wala : ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్దూ మూసే వాలా(Sidhu Moose Wala) హత్య వెనుక కెనడా గ్యాంగ్ స్టర్ ఉందని ఆ రాష్ట్ర డీజీపీ వెల్లడించారు. ఈ గ్యాంగ్ సిద్దూ వాలాపై 30 సార్లు కాల్పులు జరిపారు. ఆపై కిల్లర్స్ తనిఖీ కూడా చేయడం విశేషం.
గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ఇందుకు సంబంధించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. తానే సిద్దూ మూసే వాలా హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడు. అతడు చేసిన పోస్ట్ కలకలం రేపింది.
ఇదిలా ఉండగా ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో
చేరాడు సిద్దూ మూసే వాలా. మాన్సా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు.
ఆప్ ఎమ్మెల్యే విజయ్ సంగ్లా చేతిలో ఓడి పోయాడు. కానీ తను గాయకుడిగా పాడడం మాత్రం మానలేదు. ఇదిలా ఉండగా సిద్దూ మూసే వాలా(Sidhu Moose Wala) హత్య వెనుక ముఠా వైరం ఉందని పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు.
సిద్దూపై ఎనిమిది నుంచి 10 మంది దుండగులు 30 సార్లు కాల్చి చంపినట్లు వెల్లడలించారు. ఇన్నిసార్లు కాల్పులు జరిపాక కూడా కాల్పులకు
తెగబడిన వారు బతికే ఉన్నాడా లేదా అని తనిఖీ చేశారని చెప్పారు.
ఈ హత్య కేసులో ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ లోని మాన్సా జిల్లాలో హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన
బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
వీటిని బట్టి ఏఎన్ 94 రష్యన్ అస్సాల్ట్ రైఫిల్ ఉపయోగించినట్లు తెలిపారు పోలీసులు. గోల్డీ బ్రార్ గ్యాంగ్ లీడర్ లారెన్స్ బిష్ణోయ్ కి సన్నిహితుడు.
లారెన్స్ పంజాబ్ యూనివర్శిటీకి మాజీ విద్యార్థి నాయకుడు. గత ఏడాది అకాలీ నాయకుడు విక్కీ మిద్దు ఖేరా హత్యకు ప్రతీకారంగా ఈ హత్య
జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : పంజాబ్ సింగర్ సిద్దూ కాల్చివేత