Shashi Tharoor : ద్రోహం చేయలేను వైదొలగలేను – థరూర్
గాంధీ ఫ్యామిలీ తటస్థంగా ఉంటామని చెప్పింది
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా బరిలో ఉన్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు. తన మద్దతు దారులకు ద్రోహం చేయలేనని , ఇదే సమయంలో పోటీ నుంచి వైదొలగలేనని స్పష్టం చేశారు ఎంపీ. తాను పోటీ చేయడం ఖాయమన్నారు. అందుకే తాను ముందస్తుగా పోటీలో ఉంటానని చెప్పానన్నారు.
పార్టీలో పోటీ చేయడం అన్నది సర్వ సాధారణమైన విషయమని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. దేశంలో అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీలోనే డెమోక్రసీ ఎక్కువన్నారు. అక్టోబర్ 17న పార్టీ అధ్యక్ష పదవికి పోటీ జరగనుంది. 19న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
ఇప్పటి వరకు గాంధీ ఫ్యామిలీ నుంచి ఎంపీ మల్లికార్జున్ ఖర్గే బరిలో ఉన్నారు. ప్రస్తుతం పోటీ ఇద్దరి మధ్యే ఉంది. ఒకరు ఖర్గే మరొకరు శశి థరూర్. సెప్టెంబర్ 30తో నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగియడంతో శశి థరూర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన మహారాష్ట్రలో రెండు రోజుల పాటు ఉంటారు.
తాము తటస్థంగా ఉంటామని గాంధీ కుటుంబం తనకు చెప్పిందన్నారు ఎంపీ. అయితే గత కొంత కాలం నుంచీ తనకు మద్దతు ఇస్తూ వస్తున్న వారిని తాను ఇబ్బంది పెట్ట దల్చు కోలేదన్నారు శశి థరూర్(Shashi Tharoor). ఇదిలా ఉండగా అక్టోబర్ 14, 1956లో అంబేద్కర్ తన అనుచరులతో బౌద్ధ మతాన్ని స్వీకరించిన దీక్షా భూమి స్మారక చిహ్నాన్ని సందర్శించారు శశి థరూర్.
తాను గాంధీ కుటుంబానికి చెందిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిశాను. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అధికారిక అభ్యర్థి ఎవరూ లేరన్నారు శశి థరూర్. పార్టీ పరంగా నిష్పాక్షికమైన ఎన్నిక జరగాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.
Also Read : ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బావుండేది – ఖర్గే