Arvind Kejriwal LG : ఎల్జీ ప్రేమ లేఖలు తట్టుకోలేక పోతున్నా
ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal LG : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సీఎం మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ మరింత రక్తి కట్టిస్తున్నారు.
ఆప్ సర్కార్ ను కావాలని ఎల్జీ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. లిక్కర్ స్కాం కేసులో విచారణకు ఆదేశించారు లెఫ్టినెంట్ గవర్నర్. ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసింది. ఛార్జిషీట్ దాఖలు చేసింది.
డిప్యూటీ సీఎం సిసోడియా తో పాటు 14 మందిపై అభియోగాలు మోపింది. మరో వైపు మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలో జరిగే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు ఆప్ చీఫ్, సీఎం కేజ్రీవాల్.
ఈ సందర్భంగా తాజాగా ఎల్జీ సక్సేనా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ పథకంలో అవినీతి చోటు చేసుకుందని దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి పూర్తి వివరాలను ఇవ్వాలని కోరారు.
దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇప్పటి వరకు తన భార్య కూడా ఒక్క ప్రేమ లేఖ (ఆరోపణ) రాయలేదన్నారు. కానీ పనిగట్టుకుని ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా తనకు లెక్కకు మించి ప్రేమ లేఖలు రాస్తూ పోతున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఎవరి పరిమితులు ఏమిటో తెలుసు కోకుండా పనిగట్టుకుని టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు అరవింద్ కేజ్రీవాల్.
Also Read : మాజీ ఎంపీకి మహిళా కమిషన్ సమన్లు