Bana Singh Rahul Yatra : కెప్టెన్ బానా సింగ్ దేశానికి స్పూర్తి

ప‌ర‌మ్ వీర్ చ‌క్ర పాల్గొన‌డం గ్రేట్

Bana Singh Rahul Yatra : దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాలంటూ కాంగ్రెస్ యువ నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర శుక్ర‌వారం నిత్యం తుపాకుల మోత మోగే జ‌మ్మూ కాశ్మీర్ లోకి ప్ర‌వేశించింది.

పెద్ద ఎత్తున జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు రాహుల్ యాత్ర‌కు. ఓవైపు ఎముక‌లు కొరికే చ‌లి, మ‌రో వైపు చినుకులు కురుస్తున్నా మొద‌ట్లో జాకెట్ వేసుకున్నారు. కానీ ఆ త‌ర్వాత దాని తీసివేశారు రాహుల్ గాంధీ. ఈ స‌మ‌యంలో అనుకోని ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది.

అదేమిటంటే దేశం బాగుండాల‌ని కోరుకుంటూ భారీ ఎత్తున పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టిన రాహుల్ గాంధీని ప్ర‌త్యేకంగా అభినందించారు. దేశం గ‌ర్వించే ప‌ర‌మ వీర్ చ‌క్ర కెప్టెన్ బానా సింగ్. ఇవాళ ఆయ‌న రాహుల్ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. దేశానికి ఇలాంటి నాయ‌కులు కావాల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా త‌మ యాత్ర‌లో కెప్టెన్ బానా సింగ్ పాల్గొన‌డం చాలా సంతోషాన్ని క‌లిగించింద‌ని స్ప‌ష్టం చేశారు యువ నాయ‌కుడు రాహుల్ గాంధీ. 

ఆయ‌న‌తో పాటు శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, ఎంపీ సంజ‌య్ రౌత్ కూడా జ‌త క‌ట్టారు. వారిద్ద‌రూ ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

సియాచిన్ లోని మంచు కొండ‌ల‌పై భార‌తీయ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర వేసిన గొప్ప వీరుడు ప‌ర‌మ వీర చ‌క్ర విజేత కెప్టెన్ బానా సింగ్(Bana Singh)అంటూ కితాబు ఇచ్చారు రాహుల్ గాంధీ, సంజ‌య్ రౌత్. యాత్ర‌తో పాటు ఈ దేశానికి గ‌ర్వ కార‌ణంగా నిలిచార‌ని పేర్కొన్నారు.

Also Read : బీజేపీ విజ‌య సంక‌ల్ప యాత్ర

Leave A Reply

Your Email Id will not be published!