Car Accident: ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వలోనికి దూసుకెళ్లిన కారు ! ముగ్గురు మృతి !

ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వలోనికి దూసుకెళ్లిన కారు ! ముగ్గురు మృతి !

Car Accident : వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. స్వగ్రామానికి కారులో బయలుదేరిన ఓ కుటుంబం అదుపుతప్పి ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వలోనికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె, కుమారుడు మృతి చెందగా, భార్య ప్రాణాలతో బయటపడింది. ఇక పూర్తి వివరాల్లో వెళితే..,

Car Accident At Warangal Dist

వరంగల్‌ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన ప్రవీణ్‌ కుటుంబంతో సహా హనుమకొండలో ఉంటున్నారు. శనివారం స్వగ్రామానికి వెళ్లేందుకు భార్య, పిల్లలతో కలిసి కారులో బయలుదేరారు. సంగెం మండలం తీగరాజుపల్లి వద్దకు రాగానే ప్రవీణ్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీనితో వరంగల్‌(Warangal) ఆసుపత్రిలో చికిత్స చేయించుకుందామని వెనుదిరిగారు.

యూటర్న్‌ తీసుకుంటున్న క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వలో పడింది. కాల్వలో కొట్టుకుపోతున్న కృష్ణవేణిని స్థానికులు గమనించి రక్షించారు. సాయివర్ధన్‌ (2) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రవీణ్‌ (34), కుమార్తె ఛైత్రసాయి(4) గల్లంతయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కాలువలో నీటి ప్రవాహన్నా తగ్గించి గాలింపు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సాయంతో కారుతో పాటు గల్లంతైన ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. ఘటనా స్థలిలో కుమారుడు సాయివర్ధన్‌ మృతదేహాన్ని హత్తుకుని కృష్ణవేణి రోధిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. సంతోషంగా స్వగ్రామానికి వెళ్తోన్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేయడంతో ప్రవీణ్‌ స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం వరంగల్‌(Warangal) ఆసుపత్రికి తరలించారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఏజెంట్‍గా పని చేస్తున్నారు. బంధువుల ఇంటికి వెళ్లేందుకు కుటుంబసభ్యులతో కలిసి శనివారం ఉదయం తన కారులో బయలుదేరాడు. అనితోపాటు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే అప్పటివరకూ సాఫీగా సాగిన వారి ప్రయాణం… వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వద్దకు రాగానే కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. స్థానికులు చూస్తుండగానే ఎస్సారెస్పీ కెనాల్‍లోకి కారు దూసుకెళ్లింది. దీనిని గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ మేరకు కాలువలోకి దిగిన స్థానికులు బాధిత కుటుంబాన్ని రక్షించే ప్రయత్నం చేశారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో వాహనం కొట్టుకుపోయింది. అతి కష్టం మీద ప్రవీణ్ భార్యను కాపాడగలిగారు. కాసేపటికే అక్కడికి చేరుకున్న గజఈతగాళ్లు మిగిలిన వారిని వెలికి తీసారు. ప్రమాదం గురించి తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు.

Also Read : KCR: ఏప్రిల్ 27న వరంగల్‌ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ

Leave A Reply

Your Email Id will not be published!