PIL Kiren Rijiju Dhankar : కిరెన్ రిజిజు..ఉప రాష్ట్రపతిపై కేసు
న్యాయ వ్యవస్థను కించ పరిచారని ఆరోపణ
PIL Kiren Rijiju Dhankar : న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ పై కేసు నమోదైంది. ఈ ఇద్దరు గత కొంత కాలంగా న్యాయ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థపై న్యాయ శాఖ మంత్రి, ఉప రాష్ట్రపతి(PIL Kiren Rijiju Dhankar) విమర్శలు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఇద్దరినీ విధులు నిర్వర్తించకుండా కోర్టు నిషేధించాలని కోరుతూ ముంబై లాయర్స్ అసోసియేషన్ దావా దాఖలు చేసింది. కొలీజియం వ్యవస్థపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కిరణ్ రిజిజు, జగదీప్ ధన్ ఖర్. భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం లేక పోవడం వల్ల న్యాయ శాఖ మంత్రిగా, ఉప రాష్ట్రపతిగా ఉండేందుకు అర్హులు కారరంటూ పేర్కొన్నారు. బాంబే లాయర్స్ అసోసియేషన్ చైర్మన్ అహ్మద్ అబిది ద్వారా పిటిషన్ దాఖలు చేశారు.
ఇది ప్రజా ప్రయోజనాల కింద పిటిషన్ దాఖలైంది. చట్టం ప్రకారం యథాతథ స్థితిని మార్చేందుకు పథకం ప్రకారం అందుబాటులో ఉన్న ఎలాంటి ఆధారాన్ని ఉపయోగించకుండా ఉప రాష్ట్రపతి , న్యాయ వ్యవస్థపై(PIL Kiren Rijiju Dhankar) ప్రత్యేకించి సుప్రీంకోర్టుపై అత్యంత అవమానకరమైన, అవమానకరమైన భాషలో ఆ ఇద్దరు కావాలని దాడి చేశారంటూ ఆరోపించారు.
ఈ ఇద్దరూ న్యాయ వ్యవస్థపై దాడి మాత్రమే కాదని భారత రాజ్యాంగంపై ముందస్తు గా జరిపిన దాడి అంటూ పిటిషనర్ ఆరోపించారు. మనది ప్రజాస్వామ్య దేశమా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కష్టమని పేర్కొన్నారు ధన్ ఖర్. మరో వైపు కొలీజియంపై తీవ్ర ఆరోపణలు చేశారు కిరెన్ రిజిజు.
Also Read : అదానీ’ స్కాంపై విచారణ జరగాలి