Shaukat Ali : ఎంఐఎం యుపీ చీఫ్ షౌకత్ అలీపై కేసు
ఒక సారి పెళ్లి చేసుకోండి మూడేళ్లు పెట్టుకోండి
Shaukat Ali : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనానికి తెర తీసిన ఉత్తర ప్రదేశ్ ఎంఐఎం పార్టీ చీఫ్ షౌకత్ అలీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. హిందువులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. మీరు ఒకసారి పెళ్లి చేసుకోండి కానీ మూడేళ్లు పెట్టుకోండి అంటూ ఆరోపణలు చేశారు.
అయితే తాను ఏ వర్గాన్ని కించ పర్చలేదని, ప్రత్యేకించి హిందువులను తాను ఎలాంటి మాటలు అనలేదన్నారు షౌకత్ అలీ(Shaukat Ali). ముస్లింలను బెదిరించే వారు ఒక మహిళను పెళ్లి చేసుకుంటారని, అనేక మంది ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారని , అక్రమంగా సంతానం పొందుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం దేశమంతటా కలకలం రేపాయి. సంభాల్ లో జరిగిన సభలో ఈ కామెంట్స్ చేశారు. ఒక రోజు తర్వాత మత సామరస్యానికి భంగం కలిగించారంటూ అభియోగాలు మోపారు పోలీసులు. షౌకత్ అలీ(Shaukat Ali) మాట్లాడిన మాటలతో కూడిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది.
ఎంఐఎం రాష్ట్ర చీఫ్ ముస్లింలు రెండుసార్లు పెళ్లి చేసుకున్నా వారు ఇద్దరినీ గౌరవిస్తారని అన్నారు. కానీ మీరు (హిందువులు) ఒకసారి చేసుకుంటారు కానీ ఇద్దరు లేదా ముగ్గురిని ఉంపుడుగత్తెలను ఉంచుకుంటారంటూ ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ తన ప్రాబల్యం కోల్పోయిన ప్రతిసారి ముస్లింల వెంట పడతారంటూ ఆరోపించారు.
రాజ్ పుత్ యువరాణి జోధా బాయితో మొఘల్ చక్రవర్తి అక్బర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు షౌకత్ అలీ. తాను చేసిన ఎవరినీ ఉద్దేశించి అనలేదన్నారు.
Also Read : స్త్రీవాద దృక్ఫథం అవసరం – చంద్రచూడ్