Case File Sanjay Raut : షిండేపై కామెంట్స్ సంజయ్ పై కేసు
రూ. 2,000 కోట్ల డీల్ పై తీవ్ర ఆగ్రహం
Case File Sanjay Raut : శివసేన పార్టీకి సంబంధించిన గుర్తును ఏక్ నాథ్ షిండేకు కేటాయించడం వెనుక రూ. 2,000 వేల కోట్ల డీల్ కుదిరిందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఉద్దవ్ వర్గానికి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్. ఈ సందర్భంగా సంజయ్ రౌత్ పై సీఎం చేసిన ఫిర్యాదు మేరకు పరువు నష్టం కింద కేసు నమోదు(Case File Sanjay Raut) చేశారు పోలీసులు.
ప్రస్తుత సీఎం ఏం చేస్తున్నారంటూ నిలదీశారు సంజయ్ రౌత్. మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండేపై అవమానకరమైన రీతిలో కామెంట్స్ చేశారన్న ఆరోపణలపై శివసేన యుబీటీ నాయకుడు సంజయ్ రౌత్ పై నాసిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. షిండే తరపున బేరర్ యోగేష్ బెల్దార్ పంచవటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతున్న సందర్భంగా సంజయ్ రౌత్ సీఎం షిండేపై అవమానకరమైన పదాలు ఉపయోగించారని ఆరోపించారు. ఆయన ప్రతిష్టను కించ పరిచారంటూ మండిపడ్డారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా పీనల్ కోడ్ సెక్షన్ 500 కింద కేసు నమోదు చేశారు ఎంపీ సంజయ్ రౌత్ పై.
శివసేన పార్టీకి సంబంధించిన విల్లు..బాణం గుర్తును ఏ ప్రాతిపదికన షిండే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిందంటూ ప్రశ్నించారు. ఈ గుర్తును కేటాయించేందుకు దాదాపు భారీ ఎత్తున కోట్లు చేతులు మారాయని ఆరోపించారు సంజయ్ రౌత్. ఇదే సమయంలో త్వరలో బీఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే పార్టీ పేరు మార్చారంటూ నిప్పులు చెరిగారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీస్ కేసు నమోదు కావడం విశేషం.
Also Read : ఠాక్రే అభ్యర్థనకు ‘సుప్రీం’ ఓకే