Udit Raj : సుప్రీం తీర్పులో కులతత్వం – ఉదిత్ రాజ్
కాంగ్రెస్ నేత షాకింగ్ కామెంట్స్
Udit Raj : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది సోమవారం సుప్రీంకోర్టు పేదలకు ఈబీసీ కోటా కింద 10 శాతం రిజర్వేషన్ కల్పించడం సబబేని చెప్పిన తీర్పు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఉదిత్ రాజ్(Udit Raj) తీవ్రంగా స్పందించారు.
అత్యున్నత ధర్మాసనంలో కూడా కులతత్వం బయట పడిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన దర్మాసనం తీర్పు చెప్పింది. తీర్పు చెప్పే కంటే ముందు పేదలకు ఈడబ్ల్యుఎస్ కోటా కింద 10 శాతం ఇచ్చేందుకు ముగ్గురు న్యాయమూర్తులు దినేష్ మహేశ్వరి, బేలా త్రివేది, జేబి పార్థివాలా సమర్థించారు.
మిగతా ఇద్దరిలో సీజేఐ యూయూ లలిత్, ఇంకో న్యాయమూర్తి తప్పు పట్టారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తీర్పునకు సంబంధించి ముగ్గురి అభిప్రాయం పరిగణలోకి తీసుకుని సబబేనంటూ స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేత కీలక అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు కులతత్వమే. దాని గురించి ఇంకా సందేహం ఉందా. రాజ్యాంగంలోని 50 శాతం పరిమితిని చూపిస్తూ ఇందిరా సాహ్ని కేసులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి నిరాకరించిందని ఆరోపించారు. కానీ ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ విషయంలో తన ప్రకటనను తిప్పికొట్టిందంటూ మండిపడ్డారు.
పేద అగ్రవర్ణాల రిజర్వేషన్లను తాను వ్యతిరేకించడం లేదన్నారు. కానీ సాహ్ని విషయంలో ఎస్సీల దార్శనికతను మాత్రమే ప్రస్తావిస్తున్నట్లు మరో ట్వీట్ లో స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉదిత్ రాజ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : పాలకుల వైఫల్యం పేదలకు శాపం