MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు షాక్ సీబీఐ మరో నోటీసు
91 సీఆర్పీసీ నోటీసు జారీ చేసిన దర్యాప్తు సంస్థ
MLC Kavitha : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. ఇందులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను(MLC Kavitha) తన నివాసంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల దాకా విచారణ చేపట్టింది. ఇప్పటికే 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చింది సీబీఐ. తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి అమిత్ అరోరాకు ఆమెకు ఉన్న సంబంధం గురించి ఆరా తీశారు. ఆపై సౌత్ గ్రూప్ సంగతి ఏంటి అని ప్రశ్నించారు. ఒక రకంగా ప్రశ్నల వర్షం కురిపించింది సీబీఐ.
ఇదే సమయంలో తన పేరు ఎఫ్ఐఆర్ లో లేదని తనను కావాలని కేంద్ర ఇరికించిందంటూ ఆరోపించింది ఎమ్మెల్సీ కవిత. ఆమె ఆరోపణలు చేసిన వెంటనే సీబీఐ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. ఒకే నెంబర్ తో 10 ఫోన్లు వాడిందని, వాటిని ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేసిందిని వెల్లడించింది. అంతే కాదు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డితో కలిసి కవిత సిండికేట్ గా ఏర్పడిందని తెలిపింది.
సౌత్ గ్రూప్ పేరుతో ఏర్పడి లిక్కర్ స్కాంలో వ్యవహారం నడిపిందని, రూ.100 కోట్లు ఈ గ్రూప్ అమిత్ అరోరాకు ఇచ్చిందని వెల్లడించింది. దీంతో ఈనెల 6న నోటీసు అందుకున్న కవిత ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించింది. ఆపై 11న తాను విచారణకు హాజరవుతానని తెలిపింది.
ఈ మేరకు ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు కవితను 7 గంటల పాటు విచారించారు. వెళుతూ వెళుతూ కోలుకోలేని షాక్ ఇచ్చారు. 91 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. అంటే అర్థం తాము ఎక్కడికి పిలిచినా రావాల్సిందేనని అందులో స్పష్టం చేసింది సీబీఐ.
Also Read : ఢిల్లీ మద్యం స్కాం ఏం చేద్దాం