Bhaskar Reddy Arrest : వివేకా కేసులో భాస్కర్ రెడ్డి అరెస్ట్
అదుపులోకి తీసుకున్న సీబీఐ
Bhaskar Reddy Arrest : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది. మాజీ ఎంపీ తన చిన్నాయన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి జగన్ రెడ్డి మామ వైఎస్ భాస్కర్ రెడ్డిని(Bhaskar Reddy Arrest) కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వారాల ముందు మార్చి 15, 2019 రాత్రి, తన మేనల్లుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పులివెందుల లోని తన నివాసంలో వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు.
ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. మొదట ఏపీ రాష్ట్ర నేర పరిశోధన విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది. జూలై , 2020లో సీబీఐకి అప్పగించారు. దీంతో దర్యాప్తు వేగం పెరిగింది.
సీబీఐ ఛార్జిషీట్ ప్రకారం కడప లోక్ సభ నుంచి ప్రస్తుతం ఎంపీగా గెలుపొందిన అవినాష్ రెడ్డికి బదులుగా వివేకానంద రెడ్డి తనకు లేదా వైఎస్ షర్మిల లేదా వైఎస్ విజయమ్మకు టికెట్ ఇవ్వాలని కోరినట్లు పేర్కొంది. ఆ తర్వాత వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.
ఈ కేసుకు సంబంధించి పలుమార్లు సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డిని(Avinash Reddy) విచారించింది. తనకు మినహాయింపు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు ఎంపీ. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : గ్యాంగ్ స్టర్ల హంతకుల గుర్తింపు