CBI Case Sisodia : సిసోడియాకు షాక్ మరో కేసు నమోదు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే అరెస్ట్
CBI Case Sisodia : ఆప్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోలుకోలేని షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక ఆరోపణలు ఎదుర్కొని తీహార్ జైలులో ఉన్నారు. ఇదే సమయంలో ఆయనపై సీబీఐ మరో కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 26న మనీష్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.
ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను(CBI Case Sisodia) సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదిలా ఉండగా 2015లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్ ఎఫ్బీయూని ఏర్పాటు చేసింది. ఫీడ్ బ్యాక్ యూనిట్ ను చట్ట విరుద్దంగా సృష్టించడం , పని చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 36 లక్షల వరకు నష్టం వాటిల్లిందంటూ సీబీఐ పేర్కొంది.
జైలు లో ఉన్న తమ నేతపై మరో కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ చర్య దేశానికి విచారకరమన్నారు.
మనీష్ సిసోడియాపై అనేక తప్పుడు కేసులు బనాయించారు. ఎక్కువ కాలం కస్టడీలో ఉంచాలన్నది ప్రధానమంత్రి పథకం . ఇది దేశానికి విచారకరమని పేర్కొన్నారు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం రాజకీయ ప్రేరేపిత ఆరోపణలంటూ స్పష్టం చేసింది.
2021-22కి సంబంధించి రద్దు చేసిన ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపందించడంలో , అమలు చేయడంలో అవినీతికి పాల్పడ్డారంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. అదుపులోకి తీసుకున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో(CBI Case Sisodia) సహా మొత్తం ఏడుగురిపై సీబీఐ కేసు ఫైల్ చేసింది. సిసోడియాను విచారించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.
Also Read : రాలేనన్న కవిత కుదరదన్న ఈడీ