Unitech Fraud Case : యూనిటెక్, మాజీ డైరెక్ట‌ర్ల‌ పై మ‌రో కేసు

రూ. 395 కోట్ల బ్యాంకు మోసం

Unitech Fraud Case : యూనిటెక్ , దాని మాజీ డైరెక్ట‌ర్ల‌పై తాజాగా మ‌రో కేసు న‌మోదు చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ. ఈ మేర‌కు శుక్ర‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కెన‌రా బ్యాంక్ లో జ‌రిగిన మోసానికి సంబంధించి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు యూనిటెక్ వ్య‌వ‌స్థాప‌కులు ఇప్ప‌టికే. తాజాగా మ‌రో సీబీఐ కేసు న‌మోదు చేయ‌డం విస్తు పోయేలా చేసింది.

యూనిటెక్ , మాజీ డైరెక్ట‌ర్ల‌పై రూ. 395 కోట్ల బ్యాంక్ మోసానికి(Unitech Fraud Case) పాల్ప‌డిన‌ట్లు కేసు న‌మోదు చేసింది. కంపెనీ వెండ‌ర్ బిల్ డిస్కౌంట్ (వీబీడీ) స‌దుపాయాన్ని అనుభ‌విస్తోందంటూ ఆరోపించింది సీబీఐ. గ‌తంలో కెన‌రా బ్యాంకుకు క‌న్నం వేసిన వీరు ఐడీబీఐ బ్యాంకుకు టోక‌రా పెట్టారు. ఏకంగా రూ. 395 కోట్ల మోసానికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించింది. 

బ్యాంకు నుండి ఫిర్యాదు అందిన దాదాపు ఆరు నెల‌ల త‌ర్వాత సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ కంపెనీ, దాని మాజీ ప్ర‌మోట‌ర్లు, డైరెక్ట‌ర్లు ర‌మేష్ చంద్ర , అజ‌య్ చంద్ర‌, సంజ‌య్ చంద్ర‌ల‌పై ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ సెక్ష‌న్ల కింద నేర పూరిత కుట్ర‌, మోసం, అవినీతి నిరోధ‌క చ‌ట్టం లోని రూల్స్ కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపింది సీబీఐ.

కంపెనీ 2012లో ఐడీబీఐ బ్యాంకు నుండి రూ. 400 కోట్ల విలువైన విక్రేత బిల్లు త‌గ్గింపు స‌దుపాయాన్ని క‌లిగి ఉంద‌ని పేర్కొంది. రియ‌ల్ ఎస్టేట్ రంగంలో మంద‌గ‌మ‌నం , ఇన్వెంట‌రీ పోగు కార‌ణంగా కంపెనీ లిక్విడిటీ అస‌మ‌తుల్య‌త‌ను ఎదుర్కొంటోంద‌ని పేర్కొంది సీబీఐ.ప్ర‌స్తుతం సీబీఐ దిమ్మ తిరిగే వాస్త‌వాలు బ‌య‌ట పెట్టింది.

Also Read : అమెజాన్ దెబ్బ మామూలుగా లేద‌బ్బా

Leave A Reply

Your Email Id will not be published!