CBI Liquor Scam : లిక్కర్ స్కాంలో ముదుర్లు బెయిల్ వ‌ద్దు

హైకోర్టును ఆశ్ర‌యించిన కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌

CBI Liquor Scam : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం దేశాన్ని కుదిపేస్తోంది. ఇప్ప‌టికే ప‌లు చోట్ల ఈడీ, సీబీఐ(CBI Liquor Scam) దాడులు చేప‌ట్టింది. మ‌రో వైపు ఐటీ కూడా సోదాలు నిర్వ‌హించింది. ప్ర‌ధానంగా మ‌ద్యం స్కాం మూలాలు తెలంగాణ‌, ఏపీల‌ను కుదిపేశాయి. దీని వెనుక పెద్ద త‌ల‌కాయలు ఉన్నాయ‌ని ద‌ర్యాప్తు సంస్థ‌లు భావిస్తున్నాయి.

ఇప్ప‌టికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాతో పాటు మ‌రో 14 మందిని నిందితులుగా అభియోగాలు మోపింది సీబీఐ. ఇదే కేసుకు సంబంధించి హైద‌రాబాద్ లో పెద్ద ఎత్తున దాడులు చేప‌ట్టింది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌విత వ్య‌వ‌హారాలు చూసిన సీఏ బుచ్చిబాబు ఇంట్లో సోదాలు చేప‌ట్టింది.

కీల‌క‌మైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఇదే స‌మ‌యంలో ఆమె వ‌ద్ద అనుచ‌రుడిగా పేరొందిన బోయిన‌ప‌ల్లి అభిషేక్ రావు, విజ‌య్ నాయ‌ర్ ల‌ను అరెస్ట్ చేయ‌డంతో ఒక్క‌సారిగా తెలంగాణ‌లో , ఢిల్లీలో, ఏపీలో, మ‌హారాష్ట్ర‌లో క‌ల‌క‌లం రేగింది.

ఇదిలా ఉండ‌గా ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో బోయిన‌ప‌ల్లి అభిషేక్ రావు, విజ‌య్ నాయ‌ర్ ల‌కు బెయిల్ ర‌ద్దు చేయాలంటూ హైకోర్టును సీబీఐ ఆశ్ర‌యించ‌డం విశేషం.

ఇందులో ఆ ఇద్ద‌రు మ‌హా ముదుర్లు అని పేర్కొంది. వారిని బ‌య‌ట‌కు పంపిస్తే ఆధారాలు మాయం చేస్తారంటూ ఆరోపించింది. సీబీఐ కోర్టు ఇద్ద‌రికీ బెయిల్ మంజూరు చేసినా ఈడీ కేసులో అరెస్ట్ చేయ‌డంతో ఇద్ద‌రూ బ‌య‌ట‌కు రాలేదు.

తాజాగా సీబీఐ బెయిల్ వ‌ద్దంటూ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం షాక్ కు గురి చేసింది. మొత్తంగా తీగ లాగితే డొంకంతా క‌దిలింది.

Also Read : కూలీల‌ను టార్గెట్ చేసిన టెర్ర‌రిస్ట్ ఖ‌తం

Leave A Reply

Your Email Id will not be published!