P. Chidambaram : సీబీఐ సోదాలు ఆస‌క్తిక‌రం – చిదంబ‌రం

తేలిగ్గా తీసి పారేసిన కేంద్ర మాజీ మంత్రి

P Chidambaram : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనీయ‌ర్ నాయ‌కుడు పి. చిదంబ‌రం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం త‌న కుమారుడు కార్తీ చిదంబ‌రంతో పాటు తాను ఉంటున్న ఇళ్ల‌పై సోదాలు చేప‌ట్టింది సీబీఐ.

ఇదే స‌మ‌యంలో ఏక‌కాలంలో సీబీఐ ఢిల్లీ, చెన్నై, ముంబై, పంజాబ్, క‌ర్ణాట‌క‌, ఒడిశాలోని కార్తీ చిదంబ‌రం(P Chidambaram)కు చెందిన సలాల్లో సోదాలు చేప‌ట్టింది. దాడుల త‌ర్వాత చిదంబ‌రం ఈ సోదాలు మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించాయంటూ పేర్కొన్నారు.

తాజాగా కార్తీ చిదంబ‌రంపై సీబీఐ కేసు న‌మోదు చేసింది. ఢిల్లీలోని కార్తీ చిదంబ‌రం, పి. చిదంబ‌రం అధికారిక నివాసాల‌ను కూడా త‌నిఖీ చేసింది. ఈ సంద‌ర్భంగా పి. చిదంబ‌రం స్పందించారు.

ఇవాళ ఉద‌యం సీబీఐ బృందం చెన్నైలోని నా నివాసాన్ని, ఢిల్లీలోని నా అధికారిక ఇంటిని సోదా చేసింది. బృందం నాకు ఎఫ్ఐఆర్ చూపించింది.

అందులో నేను నిందితుడినంటూ ఎక్క‌డా లేద‌న్నారు పి. చిదంబ‌రం. సీబీఐ విస్తృతంగా సోదాలు చేప‌ట్టింది. వారు ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు ఏ ఒక్క‌టి వారికి దొర‌క‌లేద‌న్నారు.

వీరి సోదాలు త‌న‌ను మ‌రింత విస్తుపోయేలా చేశాయ‌న్నారు చిదంబ‌రం. 2011లో త‌న తండ్రి దేశ హోం శాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో చైనా పౌరుల‌కు వీసాలు ఇప్పించార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న కార్తీ చిదంబ‌రం(P Chidambaram)పై సీబీఐ తాజాగా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టింది.

ఇలా ఎన్నిసార్లు సీబీఐ దాడులు చేస్తుందో తెలియ‌డం లేద‌న్నారు కార్తీ చిదంబ‌రం. పి. చిదంబ‌రం ఆర్థిక మంత్రిగా ఉన్న స‌మ‌యంలో రూ. 305 కోట్ల మేర విదేశీ నిధుల‌ను స్వీక‌రించినందుకు ఐఎన్ఎక్స్ మీడియాకు ఎఫ్ఐపీబీ క్లియ‌రెన్స్ తో స‌హా అనేక కేసుల్లో కార్తీ చిదంబ‌రంపై ద‌ర్యాప్తు చేస్తోంది సీబీఐ.

Also Read : దీదీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీకి ఊర‌ట‌

Leave A Reply

Your Email Id will not be published!