CBI Raids RJD : ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు
లాలూ..తేజస్వి యాదవ్ కు బిగ్ షాక్
CBI Raids RJD : కేంద్రం రంగంలోకి దిగింది. తనను కాదని జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ , ఇతర పార్టీలతో కలిసి మహా కూటమి పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుంది బీజేపీ.
గత 17 సంవత్సరాలుగా జేడీయూ, బీజేపీ కలిసి ఉన్నాయి బీహార్ లో. ఎనిమిది సార్లు సీఎంగా పనిచేశారు నితీశ్ కుమార్. మహా ఘట్ బంధన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీజేపీ సీనియర్లు స్పందించారు.
తమను కాదని ఎలా నెగ్గుకు వస్తారో చూస్తామంటూ హెచ్చరించారు. వారు చెప్పినట్టుగానే బుధవారం మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది.
ఆర్జేడీ చీఫ్ ప్రస్తుత డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తండ్రి, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాల కోసం భూముల కుంభకోణం చోటు చేసుకుందని ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం తేజస్వి యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)కి చెందిన ఇద్దరు సీనియర్ నేతలకు చెందిన ఇళ్లపై సీబీఐ దాడులు(CBI Raids RJD) చేపట్టింది.
జేడయూ, ఆర్జేడీ చేతులు కలిపిన రెండు వారాల తర్వాత (14 రోజులు ) దాడికి దిగడం కలకలం రేపింది. ఇవాళ బీహార్ లో నితీశ్ కుమార్ ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కొంటోంది.
ఈ తరుణంలో సీబీఐ రంగంలోకి దిగడం మరింత ఆసక్తిని రేపుతోంది. అయితే తేజస్వి యాదవ్ దీనిని ఖండించారు. ఇదంతా కక్ష సాధింపు ధోరణి తప్ప మరోటి కాదన్నారు.
Also Read : నితిన్ గడ్కరీ షాకింగ్ కామెంట్స్