Sandip Ghosh: కోల్‌కతా ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ ఘోష్‌ ఇంటిపై సీబీఐ దాడులు !

కోల్‌కతా ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ ఘోష్‌ ఇంటిపై సీబీఐ దాడులు !

Sandip Ghosh: కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కళాశాలలో అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆర్‌జీకార్‌ ఆస్పత్రిలో జరిగిన దారుణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌(Sandip Ghosh) కు చెందిన ఆస్తులపై నేడు దాడులు నిర్వహించింది. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సీబీఐ బృందాలు తనిఖీలు మొదలుపెట్టాయి. సందీప్‌ ఘోష్‌తో పాటు ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి ఫోరెన్సిక్‌ మెడిసిన్‌,టాక్సాలజీ విభాగానికి చెందిన డాక్టర్‌ డెబాషిస్‌ సోమ్‌ ఇంటికి సైతం సీబీఐ అధికారులు వెళ్లారు. మూడురోజుల ముందు ఆర్‌జీకార్‌ ఆస్పత్రిలో మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్‌ అక్తర్‌ అలీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌తో పాటు, డెబాషిస్‌ సోమ్‌పై ఆరోపణలు చేశారు. అనంతరం సీబీఐ అధికారులు కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో శనివారం సందీప్‌ ఘోష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం సందీష్‌ ఘోష్‌ ఇల్లు, కుటుంబ సభ్యుల ఇళ్లల్లో చేస్తున్న తనిఖీలు కొనసాగుతున్నాయి.

Sandip Ghosh…

ఆగస్టు 9వ తేదీ ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో ట్రెయినీ పీజీ డాక్టర్‌ హత్యాచారానికి గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దర్యాప్తు తీరు దారుణంగా ఉందనే విమర్శలు రావడంతో హైకోర్టు కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో గతంలో పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్‌ అక్తర్‌ అలీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు.

ఈ కేసును కూడా న్యాయస్థానం సీబీఐకి బదిలీ చేసింది. మూడు వారాల్లోగా దర్యాప్తు స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సందీప్‌ ఘోష్‌ మరో నలుగురికి శనివారం లైడిటెక్టర్‌ పరీక్షలు చేశారు. దీనికోసం దిల్లీ నుంచి సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబోరేటరీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయి.

Also Read : AAP JK Elections : జమ్మూ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితా ఏడుగురు అభ్యర్థులను ప్రకటించిన ఆప్

Leave A Reply

Your Email Id will not be published!