CBI Raids : మాజీ గవర్నర్ మాలిక్ కు సీబీఐ షాక్
సహాయకుల ఇళ్లపై దాడులు
CBI Raids : కేంద్రంపై , భారతీయ జనతా పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తూ వస్తున్న జమ్మూ, కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ షాక్ ఇచ్చింది. తీవ్ర ఆరోపణలు చేసినందుకు గాను మాలిక్ గవర్నర్ గా ఉన్న సమయంలో పని చేసిన ప్రెస్ సెక్రటరీ, చార్టెడ్ అకౌంటెంట్ , పర్సనల్ అసిస్టెంట్ ఇళ్లతో పాటు ఢిల్లీ, రాజస్థాన్ లోని 12 చోట్ల సీబీఐ దాడులు చేపట్టింది. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ దాడులను తీవ్రంగా ఖండించారు మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్. దీనిని అత్యంత దురదృష్టకరమైన చర్యగా అభివర్ణించారు.
కిరు హైడ్రాలిక్ స్కామ్ కు సంబంధించి బుధవారం కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. సునక్ బాలి జమ్మూ , కాశ్మీర్ గవర్నర్ గా మాలిక్ ఉన్న సమయంలో ప్రెస్ సెక్రటరీగా పని చేశారు. సీఏగా వీఎస్ రాణా, కేఎస్ రాణా వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. ఇవాళ సీబీఐ ఏక కాలంలో ఢిల్లీ లోని 10 చోట్ల, రాజస్థాన్ లోని 2 చోట్ల సోదాలు చేపట్టింది.
జమ్మూ కాశ్మీర్ లోని కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజజెక్టు కుంభకోణం కేసుకు సంబంధించి సోదాల కోసం సీబీఐ బృందం ఢిల్లీ లోని డిఫెన్స్ కాలనీలోని బాలి నివాసానికి చేరుకుంది. ఈ కేసులో సీబీఐ ఫిర్యాదుదారుని వేధించడం మంచి పద్దతి కాదు. సునక్ బాలి ప్రభుత్వ జీతం లేకుండా నాకు ప్రెస్ సలహాదారుడిగా , కార్యదర్శిగా పని చేశారని పేర్కొన్నారు సత్య పాల్ మాలిక్.
Also Read : Siddaramaiah