CBI FBI : కర్నాటక బిట్ కాయిన్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇదిలా ఉండగా ఈ కేసును దర్యాప్తు చేసేందుకు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( ఎఫ్బిఐ) దర్యాప్తు (CBI FBI)ప్రారంభించిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
దీనిపై భారత దేశానికి చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI FBI) స్పందించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది.
అయితే కేసుకు సంబంధించి పరిశోధించే క్రమంలో భాగంగా అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకుంటుందని స్పష్టం చేసింది సీబీఐ.
ఎఫ్బీఐ టీం ఏదీ భారత్ కు రాలేదని , కాంగ్రెస్ నేతలు అమెరికా లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ అధికారులు పేర్కొంటున్న తరుణంలో సీబీఐ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
బిట్ కాయిన్ కేసు నడుస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలు కానీ ఏదీ ఇంత వరకు ఎఫ్బీఐ అడగలేదని తెలిపింది. తమకు ఎఫ్బీఐ అభ్యర్థన చేయలేదంటూ వెల్లడించింది.
దీంతో భారత దేశంలోని కాంపీటెంట్ (అధికారిక) అథారిటీ ద్వారా విచారణకు ఏదైనా పర్మిషన్ పొందే ప్రశ్న తలెత్తదని పేర్కొంది సీబీఐ.
భారత దేశంలో ఇంటర్ పోల్ కోసం నేషనల్ సెంట్రల్ బ్యూరో గా సీబీఐ ఎఫ్బీఐతో పాటు ఇతర సంస్థలతో కలిసి సమన్వయం చేసుకుంటుందని ప్రకటించింది.
ఎఫ్బీఐ ఈ విషయాన్ని పరిశీలిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు ప్రస్తావించడంపై క్లారిటీ ఇచ్చింది సీబీఐ. 2020లో డ్రగ్స్ కేసులో అరెస్టైన శ్రీకృష్ణ రమేష్ వ్యవహారం తీవ్ర దుమారం రేగింది.
పోలీసులు తమ విచారణలో రమేష్ అనేక ఆన్ లైన్ నేరాలకు పాల్పడుతున్న హ్యాకర్ అని గుర్తించారు.
Also Read : దేశాన్ని దోచుకు తింటున్న మోదీ