CBI Summons Sisodia : మనీష్ సిసోడియాకు సీబీఐ సమన్లు
హాజరు కావాలంటూ నోటీసులు
CBI Summons Sisodia : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సమర్పించిన రెండో ఛార్జ్ షీట్ లో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను చేర్చింది.
తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు(CBI Summons Sisodia) బిగ్ షాక్ ఇచ్చింది. తమ మందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. మద్యం పాలసీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఏకంగా రూ. 100 కోట్లు ముట్టాయని , ఇవి గోవా, పంజాబ్ ఎన్నికల్లో వాడారంటూ పేర్కొంది.
లిక్కర్ పాలసీ కేసులో ప్రశ్నించేందుకు దేశ రాజధాని ఢిల్లీలోని అవినీతి నిరోధక శాఖ (సీబీఐ) ఆఫీసుకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే అందజేసిన నోటీసులో పేర్కొంది. మథుర రోడ్ లోని తన అధికారిక నివాసం నుండి ఉదయం 10.30 గంటలకు హాజరు కానున్నారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.
తనకు సమన్లు జారీ చేయడంపై స్పదించారు సిసోడియా. ఇది పూర్తిగా కేంద్రం ఆడుతున్న నాటకమని, కక్ష సాధింపుతోనే తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు కేసులు నమోదు చేయడం తప్ప ఒక్క ఆధారాన్ని కూడా సేకరించ లేక పోయారని మండిపడ్డారు.
నా ఇంటిపై దాడి చేశారు. నా లాకర్లను ఓపెన్ చేశారు. కానీ వాళ్లకు ఏ ఒక్కటి దొరకలేదు. లభించదు కూడా. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. వాళ్లు ఎన్ని ప్రశ్నలు వేసినా తాను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు మనీష్ సిసోడియా.
Also Read : అప్ డేట్ అయితేనే అందుకోగలం – మోదీ