President Election Schedule : రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ డిక్లేర్
15న నోటిఫికేషన్ .. జూలై 18న పోలింగ్
President Election Schedule : భారత దేశ సర్వోన్నత పదవిగా భావించే రాష్ట్రపతి (ప్రెసిడెంట్ ) ఎన్నిలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం(President Election Schedule). ప్రస్తుత భారత దేశ రాష్ట్రపతిగా ఉన్న రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల జూలై 24తో ముగుస్తుంది.
ఇప్పటి వరకు 15 మంది రాష్ట్రపతులు తమ పదవులను చేపట్టారు. రేపు జరగబోయే ఎన్నికలు 16వ రాష్ట్రపతి పదవి కోసం జరగనున్నాయి. ఈ సందర్బంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ గురువారం మీడియాతో మాట్లాడారు.
జూలై 25 తేదీ లోపు రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఈ ఎలక్టోరల్ కాలేజీలో దేశ వ్యాప్తంగా ఎన్నుకోబడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు.
ఇదిలా ఉండగా నామినేటెడ్ సభ్యులు, ఎమ్మెల్సీలకు మాత్రం ఓటు హక్కు కల్పించ లేదు. ఈ ఎన్నికల ప్రక్రియ పార్లమెంట్ ప్రాంగణం, దేశంలోని రాష్ట్రాల శాసనసభలలో ఓటింగ్ ప్రక్రియ సాగుతుంది.
ఇక ఈ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారు. ఎన్నికలకు సంబంధించి 15న ప్రెసిడెంట్ ఎన్నికలకు(President Election Schedule) నోటిఫికేషన్ జారీ చేస్తుంది సీఈసీ.
నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ జూన్ 29. ఉపసంహరణకు జూలై 2. జూలై 18న ఓటింగ్ ..21న కౌంటింగ్ జరుగుతుంది. బ్యాలెట్ విధానంలో రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
రాష్ట్రపతితో పాటు ఉప రాష్ట్రపతి పదవికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10,98,903 ఓట్లు ఉండగా బీజేపీకి 4,65,797 , మిత్రపక్షాలకు 71,329 ఓట్లు ఉన్నాయి.
Also Read : పర్యావరణ ఇండెక్స్ పై కేంద్రం ఫైర్