Srinivas Goud : మంత్రికి ఊర‌ట ఫిర్యాదు కొట్టివేత‌

ఫిర్యాదులు కొట్టివేత‌

Srinivas Goud : ఇరు తెలుగు రాష్ట్రాల‌లో తీవ్ర సంచ‌ల‌నం రేపిన తెలంగాణ ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్(Srinivas Goud) కు ఊర‌ట ల‌భించింది.

ఆయ‌న‌పై న‌మోదు చేసిన అభియోగాలు ఉట్టివేనంటూ కొట్టి వేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం (సీఈసీ). గౌడ్ గ‌త ఎన్నిక‌ల్లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.

అనంత‌రం కేబినెట్ మంత్రిగా ఉన్నారు. పోటీ సంద‌ర్భంగా మంత్రి స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ లో త‌ప్పుగా పేర్కొన్నార‌ని, ఆ త‌ర్వాత వీటిని మార్చేశారంటూ కొంద‌రు ఫిర్యాదు చేశారు.

ఈ విష‌యంలో పూర్తి స్థాయి విచార‌ణ జ‌రిపిన‌ట్లు తెలిపింది. ఫిర్యాదు చేసిన వ్య‌క్తితో పాటు రాష్ట్ర ఎన్నిక‌ల అధికారికి, జిల్లా ఎన్నిక‌ల అధికారిగా విధులు నిర్వ‌హించిన క‌లెక్ట‌ర్ కు స‌మాచారం ఇచ్చింది.

2018 ఎన్నిక‌ల్లో శ్రీ‌నివాస్ గౌడ్(Srinivas Goud) స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ ను మార్చారంటూ గ‌త ఏడాది 2021 ఆగ‌స్టు 2న , డిసెంబ‌ర్ 16న సీఈసీకి ఫిర్యాదు చేశారు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కు చెందిన రాఘ‌వేంద్ర‌రాజు.

ఆనాడు గౌడ్ తో పాటు 25 మంది అభ్య‌ర్థులు 51 సెట్ల నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. మంత్రి 14న మూడు సెట్లు, న‌వంబ‌ర్ 19న మ‌రో సెట్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

వీటిలో 10 సెట్లు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యాయి. అదే ఏడాది న‌వంబ‌ర్ 14న శ్రీ‌నివాస్ గౌడ్ తో పాటు ఇత‌ర అభ్య‌ర్థుల‌కు సంబంధించిన మ‌ల్టిపుల్, డూప్లికేట్ నామినేష‌న్లు, అఫిడ‌విట్లు క‌నిపించ‌కుండా పోయాయ‌ని అందుకు ఎవ‌రినీ బాధ్యుల్ని చేయ‌లేమంటూ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి తెలిపారు. ఈ విష‌యాన్ని క‌లెక్ట‌ర్ ధ్రువీక‌రించారు.

Also Read : ల‌క్ష్మ‌ణ రేఖ దాటితే వేటు త‌ప్ప‌దు

Leave A Reply

Your Email Id will not be published!