Save Soil : మ‌ట్టిని కాపాడుకుంటేనే మ‌నుగ‌డ‌

పిలుపునిచ్చిన గాయ‌కులు, క్రికెట‌ర్లు

Save Soil : ఇషా ఫౌండేష‌న్ ఫౌండ‌ర్ స‌ద్గురు జ‌గ్జీ వాసుదేవ‌న్ చేప‌ట్టిన కార్య‌క్ర‌మానికి దేశంలోని ప్ర‌ముఖులంతా మ‌ద్ద‌తు ప‌లికారు. నేల విలువైన‌ద‌ని, దానిని కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని వారంటున్నారు.

బాలీవుడ్ ప్ర‌ముఖులు, గాయ‌కులు, క్రీడాకారులు సైతం త‌మ స‌పోర్ట్ ప్ర‌క‌టించారు. నేల రోజు రోజుకు బ‌రువుగా మారుతోంద‌ని, అగ్ని గోళంగా మారింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

సేవ్ సాయిల్(Save Soil) అనే నినాదానికి వారు సంపూర్ణ స‌హ‌కారం అందిస్తామ‌ని తెలిపారు. ఈ జాబితాలో అజ‌య్ దేవ‌గ‌న్ , ఆర్. మాధ‌వ‌న్ , ప్రేమ్ చోప్రా, మౌని రాయ్ , జుహీ చావ్లా, శిల్పా శెట్టి, మ‌నీషా కోయిరాలా, సోనూ నిగ‌మ్ , శ్రేయా ఘోష‌ల్ , దిల్జిత్ దోసాంజ్ , మ‌లుమా, హ‌ర్భ‌జ‌న్ సింగ్ , ఏబీ డివిలీయ‌ర్స్ , మాథ్యూ హేడ‌న్ , వివియ‌న్ రిచ‌ర్డ్స్ ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా మాధ‌వ‌న్ ట్విట్ట‌ర్ లో వీడియో సందేశాన్ని పంచుకున్నారు. మ‌న నేల పూర్తిగా క‌లుషిత‌మై పోతోంది. క‌లుషిత ఆహారం వ‌ల్ల మ‌నం రోగాల పాల‌వుతున్నామ‌ని పేర్కొన్నారు.

మ‌ట్టిని కాపాడుకుందాం మ‌నుషుల‌మ‌వుదామంటూ పిలుపునిచ్చారు. సేవ్ సాయి(Save Soil)ల్ అంటూ జ‌గ్జీ 100 రోజుల ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. ప్రేమ్ చోప్రా సైతం తాను స‌పోర్ట్ గా ఉంటాన‌ని చెప్పాడు.

65 ఏళ్ల వయ‌సు 30 వేల కిలోమీట‌ర్లు ప్రయాణం చేయ‌బోతున్నారు. ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోషాల్ కూడా సేవ్ వాట‌ర్ సేవ్ సాయిల్ కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టికే కార్పొరేట్ కంపెనీలు త‌మ వ్యాపారం కోసం ఈ అంద‌మైన భూమిని న‌ర‌క కూపంగా త‌యారు చేశారు.

Also Read : క‌ర్ణాట‌క కాంగ్రెస్ నేత‌ల‌పై కేసు

Leave A Reply

Your Email Id will not be published!