Gautham Reddy : గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం ప్ర‌ముఖుల సంతాపం

గొప్ప భ‌విష్య‌త్తు..విజ‌న్ ఉన్న నాయ‌కుడ‌ని కితాబు

Gautham Reddy : ఏపీ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి (Gautham Reddy)మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. గొప్ప స్నేహితుడిని అంత‌కంటే ఎక్కువ విజ‌న్ ఉన్న నాయ‌కుడిని కోల్పోయామ‌ని పేర్కొన్నారు.

మ‌రికొంద‌రు మంత్రులు క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. ఇది ఊహించ‌ని వార్త అని త‌ట్టుకోలేక పోతున్నామ‌ని వాపోయారు. చిన్న వ‌య‌సు లోనే గొప్ప పేరు తెచ్చుకున్నారంటూ కొనియాడారు.

నిన్న‌టి దాకా కూడా ఆయ‌న రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేశార‌ని పేర్కొన్నారు. ఓ మంచి స్నేహితుడినే కాదు గొప్ప అన్న‌య్య‌ను కోల్పోయాన‌ని బాధ ప‌డ్డారు మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్.

తెలంగాణ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. మంచి స‌హృద‌య‌త‌, స్నేహ శీలి మ‌న‌స్త‌త్వం క‌లిగిన వ్య‌క్తి మేక‌పాటి గౌతమ్ రెడ్డి(Gautham Reddy) అని ప్ర‌శంసించారు.

ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుడిని కోరుతున్న‌ట్లు తెలిపారు. ఐటీ రంగ‌మే కాదు ప‌రిశ్ర‌మ‌ల సెక్టార్ కు కూడా ఆయ‌న మంత్రిగా అద్భుతంగా ప‌ని చేశారంటూ పేర్కొన్నారు మంత్రి అవంతి శ్రీ‌నివాస్.

అభివృద్ధి చెందుతున్న ఏపీకి ఇది పెద్ద లోటు గా అభివ‌ర్ణించారు. స‌హ‌చ‌ర మంత్రిగా గా ఆయ‌న లేని లోటు పూడ్చ లేమ‌న్నారు. ఇది న‌మ్మ‌శ‌క్యంగా లేద‌న్నారు సినిమాటోగ్ర‌ఫీ, స‌మాచార శాఖ మంత్రి పేర్ని నాని.

మాట‌లు రావ‌డం లేదంటూ వాపోయారు ఉప ముఖ్య‌మంత్రి ఆళ్ల నాని, చిన్న వ‌య‌సులోనే కాలం చేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు . ఎంతో ఆప్యాయంగా పిలిచే మేక‌పాటి లేక పోవ‌డాన్ని జీర్ణించు కోలేక పోతున్నాన‌ని అన్నారు మంత్రి కొడాలి నాని.

మంత్రి త‌ల‌సాని తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌, ఏపీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్ర‌జా ప్ర‌తినిధులు, మంత్రులు, ప్ర‌ముఖులు గౌతం రెడ్డి మ‌ర‌ణం ప‌ట్ల దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు.

Also Read : మేకపాటి గౌతం రెడ్డి ఇక లేరు

Leave A Reply

Your Email Id will not be published!