Piyush Goyal : జాతీయ ప్ర‌యోజ‌నాల‌పై కేంద్రం ఫోక‌స్

స్ప‌ష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Piyush Goyal : భార‌త దేశానికి సంబంధించి ఇండో – ప‌సిఫిక్ ఆర్థిక విధానం జాతీయ ప్ర‌యోజ‌నాల‌పై దృష్టి కేంద్రీక‌రించేందుకు కృషి చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్(Piyush Goyal) .

అమెరికాలోని ఎక్కువ సంస్థ‌ల‌కు టెక్నాల‌జీ సేవ‌ల‌ను అంద‌జేస్తున్న దేశాల‌లో భార‌త్ టాప్ లో ఉంద‌న్నారు. త్వ‌ర‌లో పార్ల‌మెంట్ కు ప‌టిష్ట‌మైన ఫ్రేమ్ వ‌ర్క్ ను స‌మ‌ర్పించాల‌ని ప్ర‌తిపాదించామ‌ని చెప్పారు గోయ‌ల్.

ప్ర‌స్తుతం డిజిట‌ల్ ప్ర‌పంచంలో స‌మ‌కాలీన , ఆధునిక చ‌ట్టాల‌ను క‌లిగి ఉండాల‌ని భార‌త దేశం చూస్తోంద‌న్నారు. వాటి ఆధారంగానే భార‌త్ వివిధ అంశాల‌పై నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి చెప్పారు.

బార‌త దేశం డిజిట‌ల్ ప్ర‌పంచంలో అధిక స్థాయి డేటా గోప్య‌త‌ను కొన‌సాగిస్తూ స‌మ‌కాలీన‌, ఆధునిక చ‌ట్టాల‌ని క‌లిగి ఉండాల‌ని చూస్తోంద‌న్నారు.

జాతీయ ప్ర‌యోజ‌నాల ఆధారంగా ఐపీఎఫ్ఎఫ్ ఫ్రేమ్ వ‌ర్క్ లోని వివిధ అంశాల‌పై భార‌త దేశం త‌న నిర్ణ‌యాల‌ను తీసుకుంటుంద‌న్నారు పీయూష్ గోయ‌ల్.

రేప‌టి నాటికి తాము బ‌ల‌మైన ఫ్రేమ్ వ‌ర్క్ ను రూపొందించ‌మ‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు కేంద్ర మంత్రి.  ఇదిలా ఉండ‌గా మొద‌టి ఇండో ప‌సిఫిక్ ఎక‌నామిక్ ఫ్రేమ్ వ‌ర్క్ మంత్రివ‌ర్గ స‌మావేశంలో పాల్గొనేందుకు గోయ‌ల్ ఆరు రోజుల ప‌ర్య‌ట‌న‌లో శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్ లో ఉన్నారు.

స‌మావేశానికి ముందు ఆయ‌న యుఎస్ వాణిజ్య ప్ర‌తినిధి కేథ‌రీన్ థాయ్ ని క‌లిశారు. యుఎస్టిఆర్ రాయ‌బారి తాయ్ , యుఎస్ వాణిజ్య కార్య‌ద‌ర్శి గినా రైమోండోతో ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశం త‌న‌కు ల‌భించింద‌ని చెప్పారు ఈ సంద‌ర్భంగా పీయూష్ గోయ‌ల్(Piyush Goyal) .

అత్యాధునిక సాంకేతిక రంగాల‌తో స‌హా వాణిజ్యం , పెట్టుబ‌డుల‌లో సంబంధాల‌ను విస్త‌రించేందుకు అనుకూలంగా ఉంద‌న్నారు.

Also Read : అదానీ కోల్ మొఘ‌ల్ గ్రీన్ ఛాంపియ‌న్

Leave A Reply

Your Email Id will not be published!