Kiren Rijiju : న్యాయ వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి కేంద్రం కృషి

స్ప‌ష్టం చేసిన న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు

Kiren Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొంత కాలం నుంచి ఆయ‌న న్యాయ వ్య‌వ‌స్థ తీరు తెన్నుల‌ను బ‌హిరంగంగానే విమర్శిస్తూ వ‌స్తున్నారు.

ప్ర‌ధానంగా కొలీజియం వ్య‌వ‌స్థ‌ను తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. కిరెన్ రిజిజు(Kiren Rijiju) చేసిన కామెంట్స్ పై న్యాయ‌వాదులు, న్యాయ‌మూర్తులు సైతం తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఈ త‌రుణంలో కేంద్ర మంత్రి త‌న వాయిస్ ను మార్చిన‌ట్లు అనిపించింది.

శ‌నివారం భార‌త రాజ్యాంగ దినోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో కిరెన్ రిజిజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. న్యాయ వ్య‌వ‌స్థ‌తో కేంద్ర స‌ర్కార్ కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని చెప్పారు.

గ‌తంలో భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానానికి ప్ర‌ధాన న్యాయ‌మూర్తులుగా ప‌ని చేసిన జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ‌, జ‌స్టిస్ యూయూ ల‌లిత్ తో పాటు ప్ర‌స్తుతం కొలువు తీరిన ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ తో స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉండ‌డం తాను అదృష్టంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ దార్శ‌నిక, స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వంలో తాము ప‌ని చేస్తున్నందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు. భార‌త న్యాయ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు కిరెన్ రిజుజు(Kiren Rijiju).

భార‌త దేశం వంటి ప్ర‌జాస్వామిక దేశంలో న్యాయం అంద‌డం అన్న‌ది పెను స‌వాల్ గా ఉంటుంద‌న్నారు. వివిధ చ‌ట్ట ప‌ర‌మైన ప్లాట్ ఫార‌మ్ ల‌లో కొత్త ప‌రిష్కారాల‌ను రూపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు కేంద్ర మంత్రి.

Also Read : బెంగాల్ కు రూ. 8,200 కోట్లు విడుద‌ల

Leave A Reply

Your Email Id will not be published!