PM Modi : క‌ర్ణాట‌క అభివృద్దికి కేంద్రం ప్రాధాన్య‌త

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌క‌ట‌న

PM Modi Karnataka :  దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ క‌ర్ణాట‌క‌పై(PM Modi Karnataka) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త తొమ్మిది ఏళ్ల‌లో క‌ర్ణాట‌క కోసం కేంద్ర ప్ర‌భుత్వం చేస్తు ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కార్ క‌ర్ణాటక అన్ని రంగాల‌లో అభివృద్ది చెందేందుకు స‌హ‌కారం అంద జేస్తుంద‌ని చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి. అయితే గ‌తంలో ఏలిన ప్ర‌భుత్వాలు రాష్ట్రాన్ని లూటీ చేశాయంటూ ఆరోపించారు. క‌ర్ణాట‌క లోని త‌ల్క‌తోరా స్టేడియంలో ఢిల్లీ క‌ర్ణాట‌క సంఘానికి చెందిన బ‌రిసు క‌న్న‌డ డిమ్ దిమావా అమృత్ మ‌హోత్స‌వ్ ప్రారంభోత్స‌వంలో మోదీ ప్ర‌సంగించారు.

వేగంగా జ‌రుగుతున్న అభివృద్ది కార‌ణంగా క‌ర్ణాట‌క రూపు రేఖ‌లు పూర్తిగా మారి పోయాయ‌ని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో లాగా కాకుండా ఇవాళ దేశానికి సంబంధించిన నిధులు నేరుగా రాష్ట్ర అభివృద్ది కోసం ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు తెలిపారు మోదీ. ఈ ఏడాది ఏప్రిల్ – మే నెల‌ల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా రాష్ట్రం ఎన్ని కోట్ల నిధులు ఇచ్చామో ప్ర‌ధాన‌మంత్రి వెల్ల‌డించారు.

యుపీఏ హ‌యాంలో 2009 నుంచి 2014 వ‌ర‌కు రూ. 11,000 కోట్లు ఇస్తే తాము కేంద్రంలో కొలువు తీరాక గ‌డిచిన తొమ్మిది ఏళ్ల‌లో రూ. 30,000 కోట్ల‌కు పెంచామ‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ. ఆనాటి స‌ర్కార్ రైల్వే ప్రాజెక్టుల కోసం రూ . 4,000 కోట్లు మాత్ర‌మే ఇచ్చార‌ని కానీ తాము వ‌చ్చాక రూ. 7,000 కోట్లు ఖ‌ర్చు చేశామ‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి.ఐటీ రంగంలో దేశంలోనే క‌ర్ణాట‌క టాప్ లో ఉంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi). గ‌త కొన్నేళ్లుగా ఐటీకి పెద్ద దిక్కుగా ఉండ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు .

Also Read : మోదీతో జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!