Centre Opposes : స్వలింగ సంపర్క వివాహం ప్రమాదం
స్పష్టం చేసిన మోదీ సర్కార్
Centre Opposes : వ్యక్తిగత స్వయం ప్రతిపత్తి హక్కు స్వలింగ సంపర్క వివాహం గుర్తించే హక్కును కలిగి ఉండదని స్పష్టం చేసింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర న్యాయ వ్యవస్థకు స్పష్టం చేసింది. హిందూ చట్టంలో, ఇస్లాంలో కూడా ఇలాంటి వాటికి స్థానం లేదని పేర్కొంది. ఈ అంశంపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్ 18న మంగళవారం విచారించనుంది.
వివాహాన్ని ప్రత్యేకంగా భిన్నమైన సంస్థగా పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వివాహ భావనతో సమానంగా పరిగణించాలనే ప్రశ్న ప్రతి పౌరుడి ప్రయోజనాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కేంద్రం(Centre Opposes) ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటివి సమాజానికి, దేశానికి మంచి అభిప్రాయాలను కలిగించవని తెలిపింది.
స్వలింగ వివాహాలను మినహాయించి పెళ్లికి సంబంధించి భిన్నమైన సంస్థకు గుర్తింపు ఇవ్వడం వివక్ష కాదని పేర్కొంది. హిందూ చట్టలో, ఇస్లాం మతంలో ఎక్కడా స్వలింగ సంపర్క వివాహాల గురించి ప్రస్తావన లేదని తెలిపింది ప్రభుత్వం కోర్టుకు. వివాహం అనేది పవిత్రమైన ఒప్పందం. చెల్లుబాటు అయ్యే పెళ్లి అనేది పురుషుడు, స్త్రీల మధ్య మాత్రమే ఉంటుందని వేరే జీవులకు ఉండదని అభిప్రాయపడింది.
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ , జస్టిస్ లు ఎస్కే కౌల్ , రవీంద్ర భట్ , హిమా కోహ్లీ , పీఎస్ నరసింహలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం స్వలింగ వివాహాలకు చట్ట పరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై విచారించనుంది.
Also Read : షెట్టర్ చేరికతో కాంగ్రెస్ లో జోష్