Manish Sisodia : కేజ్రీవాల్ ను చూసి కేంద్రం కంగారు
నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం సిసోడియా
Manish Sisodia : ఎక్సైజ్ పాలసీ పేరుతో కేంద్రం తమను టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా. ఇదిలా ఉండగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది.
దాడులకు పాల్పడింది. మొత్తం 15 మందిని నిందితులుగా చేర్చింది. మొదటి నిందితుడిగా మనీష్ సిసోడియాను(Manish Sisodia) చేర్చింది.
ఉన్నతాధికారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మద్యం పాలసీలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ సీబీఐ చేసిన ఆరోపణలను ఖండించారు మనీష్ సిసోడియా.
కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను చూసి భయపడుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎంతో పాటు ఎక్సైజ్ శాఖను కూడా నిర్వహిస్తున్నారు మనీష్ సిసోడియా.
బీజేపీ కావాలని కుట్రలకు తెర లేపుతోంది. దేశ వ్యాప్తంగా బీజేపీయేతర రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ వస్తోందన్నారు డిప్యూటీ సీఎం. తన ఇంట్లో చేసిన సోదాల్లో ఏవీ దొరకలేదని చెప్పారు.
తన మొబైల్ తో పాటు కంప్యూటర్లను సీజ్ చేశారని వెల్లడించారు. ఇదిలా ఉండగా సీబీఐ శుక్రవారం ఏడు రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఇదిలా ఉండగా సిసోడియా కేంద్రంపై, నరేంద్ర మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా సీబీఐ మనీష్ సిసోడియా ఇంట్లో 14 గంటలకు పైగా సోదాలు చేపట్టింది. గత ఏడాది 2021 నవంబర్ లో ఎక్సైజ్ పాలసీని తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా మద్యం షాపుల లైసెన్సులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది ఢిల్లీ ప్రభుత్వం.
Also Read : నిధుల మళ్లింపులో ఢిల్లీ వ్యాపారి అరెస్ట్