CEO TCS : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్ గోపినాథన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ ఎకానమీ ఒడిదుడుకులు ఎదుర్కొన్నా టీసీఎస్ దాటుకుంటూ ముందుకు వెళుతుందన్నారు.
దశాబ్దం చివరి నాటికి $50 బిలియన్ల అమ్మకాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. దీర్గకాలిక డిమాండ్ తమకు ఉంటుందన్నారు.
దేశానికి సంబంధించి $227 బిలియన్ల టెక్ సేవల పరిశ్రమలో అతిపెద్ద వాటాదారుగా టీసీఎస్ ఉందని తెలిపారు సిఇఓ. యూఎస్ లోని వేలాది కంపెనీలకు తమ సంస్థ సేవలు అందజేస్తోందని వెల్లడించారు.
ఉద్యోగులు ఇంటి నుంచి, బయటి నుంచి , ఆఫీసులలో పని చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీర్ఘకాలిక డిమాండ్ వాతావరణం బలంగా ఉందన్నారు రాజేష్ గోపినాథన్CEO TCS).
ముంబై లోని ప్రధాన కార్యాలయంలో ఆయన బ్లూమ్ బర్గ్ తో మాట్లాడారు. తాము ఎలాంటి ఆందోళన చెందడం లేదన్నారు. తమకు ఊహించిన దాని కంటే ఎక్కువగా డిమాండ్ ఉందన్నారు సిఇఓ.
రెండు దశాబ్దాల కిందట టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఆయన చేరారు. క్లయింట్ సంబంధాలను మెరుగు పర్చడంలో దిట్టగా ఇప్పటికే పేరు పొందారు.
సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , తదితర అధునాతన సేవలను అందజేయడంలో ఇప్పటికే టీసీఎస్ ముందంజలో ఉంది. దీని వెనుక ప్రధాన కారణం సిఇఓనేనని(CEO TCS) చెప్పక తప్పదు.
టాటా గ్రూప్ సంస్థలలో టీసీఎస్ బలమైన వాటాను కలిగి ఉంది. ఈ ఒక్క దాని నుంచే టాటా సంస్థకు భారీ ఎత్తున ఆదాయం సమకూరుతోంది.
Also Read : ట్విట్టర్ కొనుగోలుకు ఎలోన్ మస్క్ ఆఫర్