JP Nadda Extension : జేపీ న‌డ్డా ప‌ద‌వీ కాలం పొడిగించే ఛాన్స్

వ‌చ్చే నెల‌లో ఢిల్లీలో బీజేపీ స‌మావేశం

JP Nadda Extension : భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా ప‌ద‌వీ కాలం పొడిగించేందుకే ఎక్కువ అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అమిత్ చంద్ర షా త‌ర్వాత పార్టీ ప‌రంగా కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇప్పుడు బీజేపీ అంటేనే మోదీ, అమిత్ షా, జేపీ న‌డ్డా త్ర‌యం. జ‌న‌వ‌రి 20న జేపీ న‌డ్డా ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది.

దీంతో 2024లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల దృష్ట్యా జేపీ న‌డ్డాను(JP Nadda Extension) కొన‌సాగించేందుకే ప్ర‌ధాని మోదీ మొగ్గుచూపున్న‌ట్లు స‌మాచారం. ఇక ఆయ‌న ప‌ద‌వీ కాలం పొడిగించాలంటే ముందుగా బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించాలి. అందులో తీర్మానం చేయాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం దేశంలోని తొమ్మిది రాష్ట్రాల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌, త్రిపుర‌లో బీజేపీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించింది. ఈ స‌మ‌యంలో జేపీ న‌డ్డాను కాకుండా వేరే వ్య‌క్తిని నియ‌మిస్తే ఇబ్బందులు ఏర్ప‌డుతాయ‌ని పార్టీ భావిస్తోంది. ఇక బీజేపీ కీల‌క సంస్థాగ‌త స‌మావేశంలో ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగించనుంది. ఇక జేపీ న‌డ్డా పార్టీ ప‌ద‌విని చేప‌ట్టి ఈనెల 20 తో క‌లుపుకుంటే మూడేళ్లు పూర్త‌వుతుంది.

2024 ఏప్రిల్ – మేలో లోక్ స‌భ ఎన్నిక‌లు ముగిశాక అంత‌ర్గ‌త ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంది. గ‌తంలో 2019లో లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు పార్టీ స‌న్న‌ద్ద‌త‌కు నాయ‌క‌త్వం వ‌హించేందుకు అమిత్ షా కూడా పొడిగింపు పొందారు.

ఇక లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు ఈశాన్య రాష్ట్రాల‌తో పాటు క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, మ‌ధ్య ప్ర‌దేశ్ , రాజ‌స్థాన్ , ఛ‌త్తీస్ గ‌ఢ్ స‌హా అనేక రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తంగా జేపీ న‌డ్డా ప‌ద‌వీ కాలం పొడిగింపు త‌ప్ప మ‌రో మార్గం లేదు.

Also Read : కేబినెట్ విస్త‌ర‌ణ‌పై మోదీ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!