Chandra Babu Case : బాబు బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్
స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు
Chandra Babu Case : అమరావతి – తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. శనివారం బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వు చేస్తూ తీర్పు చెప్పింది ఏపీ హైకోర్టు. గత కొంత కాలంగా చంద్రబాబు నాయుడిపై ఎనిమిది కేసులు నమోదు చేసింది ఏపీ సీఐడీ. ఇప్పటికే ఏపీ స్కిల్ స్కాం కేసుకు సంబంధించి 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించారు.
Chandra Babu Case Updates
ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీవ్ర ఉత్కంఠకు తెర దించుతూ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే అకారణ వ్యాఖ్యలు చేయొద్దని, ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయకూడదని వెల్లడించింది కోర్టు.
మరో వైపు ఏపీ స్కిల్ స్కామ్ తో పాటు ఫైబర్ నెట్ , రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కామ్ కేసులతో పాటు మరికొన్ని కేసులు నమోదు చేసింది సీఐడీ. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడితో(Chandra Babu) పాటు తనయుడు నారా లోకేష్ బాబుపై కూడా కేసులు నమోదు చేసింది.
తను రెడ్ బుక్ పేరుతో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నానని, అధికారంలోకి వచ్చాక వారి భరతం పడతానంటూ హెచ్చరిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.
Also Read : Pawan Kalyan : అభ్యర్థుల ఎంపికపై పవన్ ఫోకస్