Chandra Babu Naidu : జగన్ టూర్ కోసం చెట్లు నరికేస్తారా
హరిత హారం అంటే ఇదేనానంటూ మండిపాటు
Chandra Babu Naidu : తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య డోస్ పెంచారు. ఏపీలో రాజకీయాలు నాలుగు స్తంభాలాటగా మారి పోయింది. బీజేపీ పవన్ కళ్యాణ్ తో జత కడితే ఆయనతో స్నేహాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు టీడీపీ చీఫ్. ఏపీలో ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu).
ఇందులో భాగంగా ఆయన రోడ్ షోలు చేపడుతున్నారు. భారీ ఎత్తున జనం ఆదరిస్తున్నారు. ఓ వైపు ఎన్నికలు సమీపించక పోయినా ఇప్పటికే నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నరసాపురంలో సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తారనే నెపంతో ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న చెట్లను నరికి వేయడం చర్చనీయాంశంగా మారింది.
దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు తెలుగుదేశం పార్టీ అధినేత. ఓ వైపు ప్రపంచమంతా చెట్లను పెంచాలని, హరిత హారాన్ని కాపాడాలని పిలుపునిస్తుంటే ఏపీలో మాత్రం ఉన్న చెట్లను తొలగించడం దారుణమన్నారు. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యం తప్ప మరొకటి కాదన్నారు నారా చంద్రబాబు నాయుడు.
చెట్లు నరికివేతపై ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. జగన్ రెడ్డి కాదు ఆయన రివర్స్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. సాధారణంగా ప్రజా ప్రతినిధులు మొక్కులు నాటడం చూశాం కానీ ఉన్న చెట్లను నరికి వేయడం ఎక్కడా చూడలేదన్నారు.
ఇదంతా చూస్తుంటే ఏపీ సర్కార్ రివర్స్ గేర్ లో వెళుతోందని అర్థం అవుతోందన్నారు. ఇదిలా ఉండగా నరసాపురం ప్రాంతీయ ఆస్పత్రి ముందు ఎన్నో ఏళ్లుగా నీడనిస్తున్న చెట్టును తొలగించారు.
Also Read : సోమనాథ్ ఆలయంలో మోదీ పూజలు