Chandra Babu Naidu : బాబుకు జైలేనా బెయిల్ వ‌చ్చేనా..?

కొన‌సాగుతున్న విచార‌ణ

Chandra Babu Naidu : అమ‌రావ‌తి – ఏపీ స్కిల్ స్కాం కేసులో టీడీపీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో శిక్ష అనుభ‌విస్తున్నారు. ముంద‌స్తు బెయిల్స్ కు సంబంధించి ర‌ద్దు చేసింది హైకోర్టు. దీనిని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు.

Chandra Babu Naidu Arrest Issue

ఇదిలా ఉండ‌గా ఇదే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఇందులో అవినీతిపై వాదించ‌కుండా 17ఏ మీద ఎందుకు వాదిస్తున్నారంటూ సుప్రీం న్యాయ‌వాదులపై మెట్టి కాయ‌లు వేసిన‌ట్లు స‌మాచారం.

45 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో చంద్ర‌బాబు నాయుడు(Chandra Babu Naidu) లెక్క‌లేనంత ఆస్తులు సంపాదించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అవినీతి జ‌ర‌గ‌లేద‌ని నిరూపించు కోవాలంటే కొన్నేళ్లు ప‌డుతుంద‌ని ఆయ‌న త‌ర‌పు వాదిస్తున్న వారు న‌మ్ముతున్నారు.

దీంతో ప్ర‌తిసారి 17ఏ చుట్టే ఎక్కువ‌గా లాయ‌ర్లు ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. ఒక‌వేళ కేసు చెల్ల‌ద‌ని అనుకుంటే గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద అనుమ‌తి తీసుకుని తిరిగి కేసును రిజిస్ట‌ర్ చేసి, అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. చంద్ర‌బాబుపై ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ స్కిల్ స్కీం , ఫైబ‌ర్ నెట్ , అమ‌రావ‌తి రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం కేసులు ఉన్నాయి.

Also Read : G Kishan Reddy : తెలంగాణ‌లో నిశ్శ‌బ్ద విప్ల‌వం

Leave A Reply

Your Email Id will not be published!