Chandra Babu Welcome : బాబుకు గ్రాండ్ వెల్ క‌మ్

భావోద్వేగానికి గురైన కుటుంబం

Chandra Babu Welcome : రాజ‌మ‌హేంద్ర‌వ‌రం – ఏపీ స్కిల్ స్కాం కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ రాజ‌మండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊర‌ట నిచ్చేలా హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేర‌కు ఆయ‌న‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. ఈ సంద‌ర్బంగా ఎలాంటి కామెంట్స్ చేయ‌డం కానీ, స‌భ‌ల‌లో, రాజకీయ వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని సూచించింది. అంతే కాకుండా మీడియాతో కూడా మాట్లాడ కూడ‌ద‌ని పేర్కొంది కోర్టు.

Chandra Babu Welcome Viral

కానీ చంద్ర‌బాబు నాయుడు వాటిని బేఖాత‌ర్ చేస్తూ జైలు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌ను చూసేందుకు, స్వాగ‌తం ప‌లికేందుకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. వారిని ఉద్దేశించి చంద్ర‌బాబు నాయుడు(Chandrababu) ప్ర‌సంగించారు. తాను ఏ త‌ప్పు చేయ‌లేదంటూ స్ప‌ష్టం చేశారు. ఇదే స‌మ‌యంలో ఉండ‌వ‌ల్లికి బ‌య‌లు దేరిన టీడీపీ చీఫ్ కు అడుగ‌డుగునా గ్రాండ్ వెల్ క‌మ్ ల‌భించింది.

మీ అంద‌రి ఆద‌రాభిమానాలు త‌న‌ను ఎంత‌గానో క‌దిలించేలా చేశాయ‌ని పేర్కొన్నారు చంద్ర‌బాబు నాయుడు. స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి కోర్టు నాలుగు వారాల గ‌డువు విధించింది. ఆ త‌ర్వాత తిరిగి తుది తీర్పు వ‌చ్చేంత వ‌ర‌కు జైలులోనే ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. కానీ టీడీపీ ఇవేవీ ప‌ట్టించుకోకుండా సంబురాల‌లో మునిగి పోయింది.

Also Read : Trans Gender Ticket : ట్రాన్స్ జెండ‌ర్ కు బీఎస్పీ టికెట్

Leave A Reply

Your Email Id will not be published!