Chandrababu Case : బాబు బెయిల్ విచారణ వాయిదా
ఏపీ స్కిల్ స్కాం కేసులో కోర్టు
Chandrababu Case : అమరావతి – ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రాజమండ్రి జైలులో 53 రోజుల పాటు శిక్ష అనుభవించి ముందస్తు బెయిల్ పై బయటకు వచ్చారు ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇదే కేసుకు సంబంధించి వనకు బెయిల్ ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కంటి శస్త్ర చికిత్స కు సంబంధించి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు.
Chandrababu Case Bail Postponed
ఇదిలా ఉండగా శుక్రవారం రాష్ట్ర హైకోర్టులో ఏపీ స్కిల్ స్కాం కేసుకు సంబంధించి విచారణ కొనసాగింది. ఇరువురి తరపున న్యాయవాదులు వాదించారు. విచారణ పూర్తి కావడంతో జడ్జి కేసుకు సంబంధించి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఈనెల 15 వరకు దీనిని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ తదుపరి కేసు విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు జడ్జి. కాగా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై ఒక్క స్కిల్ స్కాం కేసే కాదు మరికొన్ని కేసులు నమోదు చేసింది ఏపీ సీఐడీ.
వీటిలో ఫైబర్ నెట్ స్కాం, అమరావతి రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం, ఏపీలో మైనింగ్ కుంభకోణం కేసులు నమోదు చేసింది. మరో వైపు వీటి కేసుల నుంచి తనను రక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు నారా చంద్రబాబు నాయుడు. సీనియర్ న్యాయవాదులు చేసిన ప్రయత్నం ఫలించ లేదు.
Also Read : Patel Ramesh Reddy : దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ కోవర్ట్