Mega DSC: మెగా డీఎస్సీపై చంద్రబాబు మొదటి సంతకం ! పూర్తి వివరాలు ఇవే !

మెగా డీఎస్సీపై చంద్రబాబు మొదటి సంతకం ! పూర్తి వివరాలు ఇవే !

మెగా డీఎస్సీపై చంద్రబాబు మొదటి సంతకం ! పూర్తి వివరాలు ఇవే !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్‌పై చంద్రబాబు నాయుడు సంతకం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిసిరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. ఇక సీఎం చంద్రబాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీ విషయానికి వస్తే…

 

మెగా డీఎస్సీ పోస్టుల వివరాలు

మొత్తం పోస్టులు- 16347

స్కూల్ అసిస్టెంట్ – 7,725

ఎస్‌జీటీ – 6371

టీజీటీ – 1781

పీజీటీ – 286

ప్రిన్సిపల్స్ – 52

పీఈటీ – 132

 

అవనిగడ్డలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు డీఎస్సీ ఆశావహులు పాలాభిషేకం నిర్వహించారు. మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేయడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అవనిగడ్డలో శిక్షణ పొందుతున్న డీఎస్సీ ఆశావహుల ఆద్వర్యంలో పాలాభిషేకం గురువారం పాలాభిషేక కార్యక్రమం జరిగింది. డీఎస్సీ అభ్యర్థులు నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. నిరుద్యోగులు ఐదేళ్లపాటు తమ విలువైన సమయాన్ని కొల్పోయారని ఆయన అన్నారు. అభ్యర్థుల కష్టాన్ని చూసి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ నెరవేచుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!