Chandrababu Naidu : మహానాడుకు తరలి రండి – చంద్రబాబు
పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపిన టీడీపీ చీఫ్
Chandrababu Naidu : దివంగత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మే 27, 28 తేదీల్లో ఏపీలోని రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మహానాడుకు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో దీనిని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు స్వయంగా డిజిటల్ సంతకంతో కూడిన ఆహ్వాన పత్రికలను పంపించారు. ఈ సందర్బంగా దివంగత సీఎం ఎన్టీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అంటూ కొనియాడారు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణనాత్మక మార్పునకు నాంది పలికిన ఏకైక నాయకుడు అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహానాడులో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు. మే 28న జరిగే బహిరంగ సభకు 15 లక్షల మందికి పైగా హాజరు కానున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భారీ ఎత్తున మహానాడుకు రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రవాస భారతీయులకు విమాన టికెట్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం మహానాడు ఏర్పాట్లలో టీడీపీ నిమగ్నమై ఉంది.
Also Read : Revanth Laxma Reddy