Chandrababu Naidu : క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు
Chandrababu Naidu : అమరావతి – ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టడంతో జడ్జి 14 రోజుల కస్టడీ విధించింది.
Chandrababu Naidu Cuase Petition Viral
దీంతో ఏపీ ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు ధోరణితోనే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిందంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు వాయిదా వేసింది. దీంతో రాష్ట్ర హైకోర్టులో క్వాష్ పిటిషన్ తో పాటు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నారా చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు.
మంగళవారం చంద్రబాబు కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగింది. చంద్రబాబు(Chandrababu Naidu) తరపున సుప్రీంకోర్టుకు చెందిన లాయర్లతో పాటు ఏపీ సర్కార్ తరపున ఏఏజీ వాదించారు.పెద్ద ఎత్తున వాదోపవాదాలు కొనసాగాయి.
చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. రెండు రోజుల తర్వాత తీర్పు వెలువరిస్తానని స్పష్టం చేశారు జడ్జి. దీంతో ఎలాగోనైనా బయటకు రావాలని అనుకున్న మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆశలపై నీళ్లు చల్లింది కోర్టు.
Also Read : CJI Justice Chandrachud : సీజేఐ షాకింగ్ కామెంట్స్
