Chandrababu Naidu : కూల్చివేత ముమ్మాటికి కక్ష సాధింపే
నిప్పులు చెరిగిన చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ కూల్చివేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య గా ఆయన అభివర్ణించారు. బీసీల వాయిస్ వినిపిస్తున్న ఆయన గొంతును మూసి వేయాలనే దిశగా ఇలాంటి చౌకబారు చర్యలకు దిగారంటూ మండిపడ్డారు చంద్రబాబు(Chandrababu Naidu).
తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడం, అందులో ఉన్న బలమైన బీసీ నేతలను కావాలని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడం గత కొంత కాలం నుంచి కొనసాగుతూ వస్తోందని మండిపడ్డారు.
ప్రధానంగా అయ్యన్న పాత్రుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తూ, నిలదీస్తూ వస్తున్నారని దీంతో తట్టుకోలేక ఇవాళ ఆయన ఇంటి గోడల్నికూల్చి వేసే పనికి శ్రీకారం చుట్టారని సీరియస్ అయ్యారు.
ఒక రకంగా ఇది చీకటి దాడిగా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అభివర్ణించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించి చింతకాయల అయ్యన్న పాత్రుడు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేక పోయారని అన్నారు.
ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్దమంటూ పేర్కొన్నారు చంద్రబాబు. అయ్యన్నపాత్రుడు ఎక్కడా రూల్స్ అతిక్రమించ లేదని స్పష్టం చేశారు.
కావాలని కక్ష సాధింపు లో భాగంగా ఇవాళ ఈ ఘటనకు పాల్పడ్డారంటూ ఆరోపించారు టీడీపీ చీఫ్. ప్రజాస్వామ్యంలో ఏదైనా ఉంటే చెప్పాలని కానీ ఇలా వ్యవహరించడం మంచి పద్దతి కాదని సూచించారు.
Also Read : సోషల్ మీడియాపై కేంద్రం నజర్