Chandrababu Naidu : టీటీడీపై భగ్గుమన్న టీడీపీ చీఫ్
భద్రతా వైఫల్యం వల్లనే చిన్నారి ఘటన
Chandrababu Naidu : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి నిర్వాకం, భద్రతా వైఫల్యం వల్లనే చిన్నారి ఘటన చోటు చేసుకుందని టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. శ్రీవారి అలిపిరి మార్గంలో వెళుతున్న భక్తులకు చెందిన ఓ చిన్నారిని క్రూర జంతువు చంపేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాప మృతికి సంతాపం తెలిపారు. ఇదే సమయంలో టీటీడీపై సీరియస్ కామెంట్స్ చేశారు నారా చంద్రబాబు నాయుడు.
Chandrababu Naidu Serious Comments
శ్రీవారి మెట్లు, అలిపిరి మార్గాలలో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందింది టీటీడీ అని పేర్కొన్నారు. దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది పాలకమండలి, ఈవో , ఏపీ సీఎం అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే టీటీడీ రాజకీయ పునరావాసంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి.
కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా నడక దారిన నిత్యం వచ్చే భక్తులకు సరైన భద్రతా ఏర్పాట్లు చేయక పోతే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికే భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు చేయడం మానుకోవాలని , భక్తులకు ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నం చేయాలని , సెక్యూరిటీ పెంచాలని భక్తులు కోరుతున్నారు. మొత్తంగా చిన్నారి ఘటన టీటీడీ పనితీరు బాగా లేదన్నది తేలి పోయింది.
Also Read : KC Venu Gopal Offer : షర్మిలకు కేసీ బంపర్ ఆఫర్