Chandrababu Naidu : ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు తెలుగు దేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు.
ఇవాళ ఆయన హైదరాబాద్ లో మేకపాటి నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. గౌతమ్ రెడ్డి తండ్రిని ఓదార్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. మేకపాటి గౌతమ్ రెడ్డి అత్యంత వివాద రహితుడిగా పేరొందారని కొనియాడారు. ఇది ఊహించని పరిణామమని పేర్కొన్నారు. ఏపీ పట్ల ఆయనకు ఉన్న అభిమానం గొప్పదన్నారు.
అంతే కాకుండా ఇంత చిన్న వయసులో మనల్ని వీడడం తనను ఎంతో బాధకు గురి చేసిందన్నారు. ఇదే సమయంలో తన పట్ల ఎప్పుడూ ఆదరంగా ఉండే వాడని కితాబు ఇచ్చారు.
విషయం తెలిసిన వెంటనే తాను దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). విధి వైపరీత్యం చాలా బలీయమైనదని అన్నారు.
చాలా తక్కువ సమయంలో గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. సమర్థవంతమైన నాయకుడిగా ఎదిగారు. కానీ అందరి పట్లా ఆప్యాయంగా ఉండేవారని ప్రశంసించారు.
ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా , చివరి దాకా సమర్థవంతంగా పని చేశాడని అన్నారు. ఇవాళ అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగిన గౌతమ్ రెడ్డి చిన్న వయసులో కాలం చేయడం బాధాకరమని చెప్పారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు.
Also Read : వనరుల వినియోగం అభివృద్దికి సోపానం