Chandrakant Patil : సుప్రియాకు మరాఠా బీజేపీ చీఫ్ క్షమాపణ
స్పష్టం చేసిన జాతీయ మహిళా కమిషన్
Chandrakant Patil : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ సుప్రియా సూలేపై నోరు పారేసుకున్న మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్(Chandrakant Patil) ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్నారు.
ఇంటికి వెళ్లి వంట చేసుకో అంటూ ఆయన ఈ మధ్య చులకనగా వ్యాఖ్యానించారు సూలేపై. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు, మహిళా సంఘాలు, నాయకురాళ్లు, ఎంపీలు తీవ్రంగా తప్పు పట్టారు.
పొద్దస్తమానం భారతీయ సంస్కృతి, నాగరికత అంటూ గొప్పలు పోయే బీజేపీ నేతలు మహిళల పట్ల ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడటం ఎంత వరకు సబబు అంటూ నిప్పులు చెరిగారు.
చంద్రకాంత్ పాటిల్ పై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. సమాజంలోని వివిధ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ స్పందించారు.
భారత రాజకీయాల్లో సెక్సిజం ప్రబలంగా ఉందన్నారు. ఈ ధోరణికి వ్యతిరేకంగా రాజకీయ హద్దులు దాటి మహిళా చట్ట సభల సభ్యురాళ్లు ఏకంగా కావాలని కోరారు.
దీంతో చంద్రకాంత్ పాటిల్ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. రంగంలోకి దిగిన జాతీయ మహిళా కమిషన్ పాటిల్ కు నోటీసులు జారీ చేసింది.
వెంటనే సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. పాటిల్ స్వయంగా కమిషన్ వద్దకు చేరుకుని తాను తప్పుగా మాట్లాడానని , క్షమించమని కోరారని కమిషన్ స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని పీటీఐ వెల్లడించింది. కాగా చంద్రకాంత్ పాటిల్(Chandrakant Patil) తన విశాల హృదయాన్ని చూపించారని ఈ విషయాన్ని ఇక విరమించు కోవాలని ఎన్సీపీ నాయకురాలు కోరారు.
Also Read : అపురూప చిత్రం ఒబామా జ్ఞాపకం