King Charles : యుకె కింగ్ గా కొలువు తీరిన చార్లెస్

ఎలిజ‌బెత్ మ‌ర‌ణంతో చార్లెస్ కు చీఫ్ గా ఛాన్స్

King Charles :  యునైటెడ్ కింగ్ డ‌మ్ (యుకె) దేశానికి కింగ్ (రాజు)గా కొలువు తీరారు చార్లెస్. సుదీర్ఘ కాలం పాటు క్వీన్ ఎలిజబెత్ కొన‌సాగారు. 96 ఏళ్ల వ‌య‌స్సులో తుది శ్వాస విడిచారు.

ఆమె స్థానంలో త‌దుప‌రి రాజుగా కింగ్ చార్లెస్(King Charles) ప‌ద‌వీ బాధ్య‌తలు చేప‌ట్టారు. త‌న విధులు ఏమిటో, త‌న ప‌రిమితులు ఏమిటో త‌న‌కు తెలుస‌న్నాడు ఈ సంద‌ర్భంగా చార్లెస్.

ఇదిలా ఉండ‌గా ఇంకా ఎలిజ‌బెత్ కు సంబంధించిన అంత్య‌క్రియ‌లు ఎప్పుడు నిర్వ‌హిస్తార‌నే దానిపై యూకె ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించ లేదు.

ఇప్ప‌టికే ప‌లు దేశాలకు సంబంధించిన అధ్య‌క్షులు, ప్ర‌ధాన‌మంత్రులు హాజ‌రు కానున్నారు. ఇవాళ అధికారికంగా తాను కూడా వెళ్ల‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్(Joe Biden).

రాయ‌ల్ వేడుక‌లో కింగ్ అని పేరు పెట్టిన చార్లెస్ విధుల గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు చార్లెస్. త‌న బాధ్య‌త‌లు ఏమిటో త‌న‌కు బాగా తెలుస‌న్నారు. ఎందుకంటే ఆయ‌న త‌ల్లి అడుగు జాడ‌ల్లో న‌డిచారు.

ఆమెకు చేదోడు వాదోడుగా ఉన్నారు. ప్ర‌పంచంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌న్నింటిని ఆయ‌న ద‌గ్గ‌రుండి చూశాడు. అందుకే దేశం యావ‌త్తు దుఖః సాగ‌రంలో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

త‌ల్లి క్వీన్ ఎలిజ‌బెత్ -1 మ‌ర‌ణంతో 73 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కు సింహాస‌నం ద‌క్కింది. చార్లెస్ -3ని అక్సెష‌న్ కౌన్సిల్ శ‌నివారం అధికారికంగా బ్రిట‌న్ దేశానికి కొత్త రాజుగా ప్ర‌క‌టించింది.

సార్వ భౌమాధికారం విధులు, గురుత‌ర బాధ్య‌త గురించి త‌న‌కు లోతైన అవ‌గాహ‌న ఉంద‌న్నారు చార్లెస్.

Also Read : ఎలిజ‌బెత్ జీవితం అజ‌రామ‌రం – చార్లెస్

Leave A Reply

Your Email Id will not be published!