Mamata Banerjee : ఓటర్ లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి – దీదీ
లేకపోతే నిర్బంధం విధించే అవకాశం
Mamata Banerjee : టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదోనని చూసుకోవాలని సూచించారు. పౌరసౌత్వం చట్టం ఎన్ఆర్సీ కింద నిర్బంధాన్ని నివారించేందుకు ఓటరు లిస్టులో మీ పేరు చెక్ చేసుకోవాలని స్పష్టం చేశారు సీఎం.
ఓటరు జాబితాలో మీ పేరు ఉందని నిర్దారించుకోండి. లేకుంటే మిమ్నల్ని ఎన్ఆర్సీ పేరుతో నిర్బంధ శిబిరాలకు పంపుతారంటూ హెచ్చరించారు మమతా బెనర్జీ. ఇది సిగ్గు చేటు అని దీదీ కేంద్ర సర్కార్ పై మండిపడ్డారు. ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్న వారు సైతం మరోసారి తమ పేరు, వివరాలు కరెక్టుగా ఉన్నాయో లేదో సరి చూసు కోవాలని కోరారు సీఎం.
ఎన్ఆర్సీని అమలు చేసే ముసుగులో నిర్బంధ శిబిరాలకు పంపించకుండా ఉండేందుకు గాను ఓటర్లు తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలంతా తన మాట వినాలని కోరారు మమతా బెనర్జీ(Mamata Banerjee) . అన్ని జిల్లాలకు చెందిన అణగారిన కుటుంబాలకు భూమి పట్టాలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.
ఎవరైనా మీ భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. బాధితులకు అండగా ప్రభుత్వం తప్పక ఉంటుందని హామీ ఇచ్చారు సీఎం. ఇదిలా ఉండగా మరోసారి మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు బెంగాల్ సీఎం. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు ఇప్పటి వరకు నిధులు కేంద్రం మంజూరు చేయలేదని ఆరోపించారు.
Also Read : డ్రగ్స్ ఇచ్చారు సోనాలీ ఫోగట్ ను చంపేశారు