Kuno National Park: పులిని చంపిన అటవీశాఖ అధికారులు! కునో నేషనల్ పార్కులో మరో చీతా విడుదల!

పులిని చంపిన అటవీశాఖ అధికారులు! కునో నేషనల్ పార్కులో మరో చీతా విడుదల!

Kuno National Park : పులిని పట్టుకోవడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులపై అది ఒక్కసారిగా దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం వారు దాన్ని కాల్చి చంపారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లా వండిపెరియార్‌ గ్రామంలో చోటుచేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి ఇటీవల సమీప జనావాసాల్లోకి వచ్చిన పులి అక్కడ కొన్ని పశువులను చంపింది. ఈ నేపథ్యంలోనే దాన్ని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అది ఓ తేయాకు తోటలో ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది… దానికి మత్తుమందు ఇవ్వడానికి 15 మీటర్ల దూరం నుంచి మొదట కాల్పులు జరిపారు. అయితే అది ఒక్కసారిగా వారిపై దూకి దాడి చేసింది. ఆత్మరక్షణ కోసం సిబ్బంది వెంటనే మళ్లీ కాల్పులు జరపడంతో అది మృతి చెందినట్లు అటవీశాఖ సీనియర్‌ అధికారులు వెల్లడించారు. మృతి చెందిన పులి వయసు పదేళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

Kuno National Park – కునో నేషనల్ పార్కులో మరో చీతా, నాలుగు పిల్లలు విడుదల

మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో(Kuno National Park) దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన గామిని అనే చీతాతో పాటు దాని నాలుగు పిల్లలను సోమవారం ఎన్‌క్లోజరు నుంచి ఖజూరీ అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టారు. దీనితో ఈ పార్కులో ఇప్పటివరకూ బయటకు వదిలిన చీతాల సంఖ్య 17కు చేరింది. ఇంకా 9 చీతాలు ఎన్‌క్లోజరులోనే ఉన్నాయి. మొత్తంగా 26 చీతాల్లో 14 ఈ పార్కులోనే జన్మించాయి. దేశంలో చీతాల సంఖ్యను పునరుద్ధరించడానికి ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2022 సెప్టెంబరులో నమీబియా, 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి చీతాలను కునో జాతీయ పార్కుకు తీసుకొచ్చారు.

Also Read : Sunita Williams: అంతరిక్షం నుండి బయలుదేరిన సునీతా విలియమ్స్‌! ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్న నాసా!

Leave A Reply

Your Email Id will not be published!