VK Sasikala : అన్నాడీఎంకేలో నెంబర్ టూగా చక్రం తిప్పిన వీకే శశికళ అలియాస్ చిన్నమ్మకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆమె గత కొంత కాలం నుంచీ మరోసారి రాజ్యాంగేతర శక్తిగా అవతరించాలని ఉవ్విళ్లూరుతోంది.
తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అన్నాడీఎంకే లో చోటు సంపాదించాలని ప్రయత్నం చేసింది. సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితం గడిపిన ఆమె బెంగళూరు నుంచి భారీ కాన్వాయ్ తో చెన్నపట్టణానికి వచ్చింది.
ఇదే సమయంలో శశికళ (VK Sasikala) జోక్యాన్ని నిరసిస్తూ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు అన్నాడీఎంకే చీఫ్ ఎడాపాడి పళనిస్వామి ప్రకటించారు. దీనిని సవాల్ చేస్తూ శశికళ చెన్నై కోర్టును ఆశ్రయించింది.
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండే హక్కు తనకు ఉందని , దీనిని తిరిగి తనకే అప్పగించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరింది. ఈ మేరకు శశికళ దాఖలు చేసిన దావాను కోర్టు విచారించింది.
ఇది పూర్తిగా సత్యదూరంగా ఉందని పేర్కొంటూ ధర్మాసనం ఆమె పిటిషన్ ను కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది. దీంతో బిగ్ షాక్ తగిలినట్లయింది చిన్నమ్మకు.
ఇదిలా ఉండగా అన్నాడీఎంకే తనదని, తిరిగి అందులో కి రీ ఇంట్రీ ఇచ్చి తమిళనాడుకు సీఎం కావాలన్నది మేడం కోరిక. 2017లో పార్టీ నుంచి ఆమెను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చేసిన పిటిషన్ బుట్ట దాఖలు చేసింది కోర్టు.
తమిళనాట చక్రం ఎలా తిప్పుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
Also Read : రాహుల్ కామెంట్స్ పై మాయావతి కన్నెర్ర