Chhattisgarh Encounter : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో 18కి చేరిన మృతుల సంఖ్య
ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసుల వైపు కూడా మరణాలు నమోదయ్యాయని..
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ లోని దక్షిణ బస్తర్ మారేడుబాక అడవుల్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 12 కాదా? మొత్తం 18 మంది చనిపోయా రా? వీరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారా? ఈ ప్రశ్నలకు మావోయిస్టు పార్టీ ఔననే పేర్కొంటూ దక్షిణ బస్తర్ కార్యదర్శి గంగా పేరుతో శనివారం మీడియాకు ఓ లేఖ పంపింది. అంతేకాదు.. ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసుల వైపు కూడా మరణాలు నమోదయ్యాయని, దామోదర్ వీరోచితంగా పోరాడి, అమరుడయ్యారని పేర్కొన్నారు.
అయితే.. అటు ఛత్తీస్‌గఢ్(Chhattisgarh), ఇటు తెలంగాణ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. చనిపోయిన మావోయిస్టుల్లో పెద్ద నా యకులెవరూ లేరని తెలిపారు. శనివారం మధ్యాహ్నం దక్షిణ బస్తర్ కమిటీ కార్యదర్శి గంగా పేరుతో మీడియాకు ప్రెస్‌నోట్ విడుదలైంది. ‘‘మొత్తం 18 మంది చనిపోయారు. ఆరు మృతదేహాలను మా వెంట తీసుకెళ్లాం. మృతుల్లో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు అలియా స్ దామోదర్, హంగి, దెవే, జోగా, నర్సింహారావు ఉన్నారు. దామోదర్‌పై రూ.50 లక్షల రివార్డు ఉంది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. శనివారం బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ కూడా ప్రకటన విడుదల చేశారు. అయితే.. నక్సల్స్ లేఖను ధ్రువీకరించకుండా.. ‘‘18 మంది చనిపోయారని మావోయిస్టులు చెబుతున్నా రు. వారిలో దామోదర్ ఉన్నట్లు చెబుతున్నారు’’ అని పేర్కొన్నారు. కానీ, ఆ వివరాలను ధ్రువీకరించలేదు.
Chhattisgarh Encounter Deaths…
ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసులు గుర్తించిన 12 మం ది మృతుల్లో సింహభాగం హిడ్మా పీఎల్‌జీఏ ఒకటో బెటాలియన్‌కు చెందినవారే ఉన్నారు. ‘‘హిడ్మా భద్ర తా వలయానికి చెందిన వారే తాజా ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు తెలుస్తోంది. హిడ్మా, మిగతా మావోయిస్టులు అడవిలో తప్పించుకున్నారు. కూంబింగ్ కొనసాగుతోంది’’ అని ఛత్తీ్‌సగఢ్ పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు సుకుమా జిల్లాకు చెందిన 22 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారు.
Also Read : Minister Uttam Kumar : కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ ఆసక్తికర ప్రకటన