Chhattisgarh Murder : జర్నలిస్టు ముకేశ్ కుటుంబానికి సీఎం 10 లక్షల ఆర్థిక సాయం

ఓ జాతీయ మీడియా సంస్థలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు...

Chhattisgarh : రహదారుల నిర్మాణంలో భారీ అవినీతిని వెలుగులోకి తీసుకు వచ్చి.. బిజాపూర్ జిల్లాలో దారుణ హత్యకు గురైన ప్రీ లాన్స్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రార్కర్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి ప్రకటించారు. మంగళవారం రాయ్‌పూర్‌లో విలేకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి(Vishnu Deo Sai) మాట్లాడుతూ.. జర్నలిస్టుల కోసం భవనాన్ని నిర్మించి.. దానికి ముఖేష్ చంద్రార్కర్ పేరు పెడతామని తెలిపారు. ఈ హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు చెప్పారు.

Chhattisgarh Journalist Murder..

బస్తర్‌కు చెందిన ముఖేష్ చంద్రార్కర్(Mukesh) .. ఓ జాతీయ మీడియా సంస్థలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. అయితే బస్తర్ ప్రాంతంలోని గంగలూరు నుంచి హిరోలి వరకు రూ.120 కోట్లతో రహదారి ప్రాజెక్ట్ పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో భారీగా అవినీతి చోటు చేసుకొన్నదంటూ అతడు కథనాన్ని వెలువరించారు. మొదట రూ.50 కోట్ల టెండర్‌తో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్.. పూర్తి స్థాయిలో జరగలేదని తెలిపారు. కానీ ఈ ప్రాజెక్ట్ రూ.120 కోట్లుకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. జనవరి 1వ తేదీన ముఖేష్ అదృశ్యమైయ్యాడు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ ఇంట్లో ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్‌లో అతడు శవమై కనిపించాడు. అయితే పచ్చబొట్టు ఆధారంగా ఆ మృతదేహం ముఖేష్‌ చంద్రార్కర్‌దిగా గుర్తించారు. అందుకు సంబంధించి.. ముగ్గురి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు ముఖేష్ బంధువులే కావడం గమనార్హం.

ఓ వైపు ప్రీ లాన్స్ జర్నలిస్ట్‌గా విధులు నిర్వహిస్తూ.. బస్తర్ జంక్షన్ అనే యూట్యూబ్ చానెల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ చానెల్‌కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. 1.59 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అయితే 2021 ఏప్రిల్‌లో బీజాపూర్‌ జిల్లాలో నక్సల్స్ దాడి చేశారు. ఈ దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది మరణించారు. అదే సమయంలో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌‌ను మావోయిస్టులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల చెర నుంచి అతడిని విడిపించేందుకు ముఖేష్ చంద్రార్కర్ కీలకంగా వ్యవహరించిన విషయం విధితమే. మరోవైపు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న కాంట్రాక్టర్ సురేష్ చంద్రార్కర్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడమే కాకుండా.. అతడికి కేటాయించిన కాంట్రాక్ట్‌లను ప్రభుత్వం రద్దు చేసింది.

Also Read : Makar Sankranti 2025 : ప్రేక్షక మహాశయులకు ‘మకర సంక్రాంతి’ శుభాకాంక్షలు

Leave A Reply

Your Email Id will not be published!