Chhattisgarh Reservation : ఛత్తీస్గఢ్లో 76 శాతం రిజర్వేషన్లు
సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
Chhattisgarh Reservation : ఛత్తీస్ గఢ్ లో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 76 శాతం రిజర్వేషన్లను ప్రకటించింది. ఈ మేరకు శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించింది.
ఇక ఆమోదించిన బిల్లుల ప్రకారం షెడ్యూల్డ్ తెగలకు 32 శాతం, ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) 27 శాతం, షెడ్యూల్డు కులాలకు 13 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 4 శాతం(Chhattisgarh Reservation) కేటాయించారు. ఇంత భారీ ఎత్తున ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం దేశంలోనే మొదటిసారి.
ఏ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున సాహసం చేయలేదు. గత కొంత కాలం నుంచి సీఎం భూపేశ్ బాఘేల్ చెబుతూ వస్తున్నారు. ఇవాళ ఆచరణకు నోచుకుంది. ఇదిలా ఉండగా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఎప్పుడో అమలు చేయాల్సి ఉందని కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యం జరిగిందని చెప్పారు సీఎం.
వివిధ వర్గాల జనాభా నిష్పత్తిలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎండు సవరణ బిల్లలను ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
రాష్ట్రంలో మొత్తం కోటా 76 శాతానికి చేరుకుంది. సీఎం భూపేష్ బఘేల్ చత్తీస్ గఢ్ పబ్లిక్ సర్వీస్ సవరణ బిల్లు, విద్యా సంస్థల సవరణ బిల్లులను ప్రవేశ పెట్టారు. దాదాపు ఐదు గంటల సేపు చర్చ జరిగిన తర్వాత ఆమోదించారు. బిల్లులపై చర్చకు సమాధానం ఇచ్చారు. గత బీజేపీ ప్రభుత్వం పరిమాణాత్మక డేటా కమిషన్ ను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు సీఎం.
2019లో తాము కమిషన్ ను ఏర్పాటు చేయడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
Also Read : తమిళనాడు గుడుల్లో మొబైల్స్ బ్యాన్